Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
bahubali2 extrodnary

ఈ సంచికలో >> సినిమా >>

రాశీకి రెండోస్సారి

rashiki second time

ముద్దుగుమ్మ రాశీ ఖన్నా చాలా బిజీ అయిపోతోంది. తాజాగా 'సుప్రీమ్‌' సినిమాతో విజయం అందుకుంది. రామ్‌తో 'హైపర్‌'లో నటించింది. ఇటీవలే తమిళంలోనూ అడుగుపెట్టింది. అక్కడ కూడా ఆమె రెండు సినిమాల్లో నటిస్తోంది. తెలుగులోనూ, తమిళంలోనూ బిజీగా గడుపుతున్న సీనియర్‌ హీరోయిన్ల లిస్టులోకి రాశీఖన్నా కూడా చేరిపోయేలానే ఉంది. తెలుగులో గోపీచంద్‌ సరసన 'ఆక్సిజన్‌' సినిమాలోనూ రాశీ ఖన్నానే హీరోయిన్‌. ఆల్రెడీ 'జిల్‌' సినిమాలో నటించింది గోపీచంద్‌తో రాశీఖన్నా. రెండోసారి గోపీచంద్‌, కావాలనే రాశీని హీరోయిన్‌గా ఎంచుకున్నాడు ఈ సినిమాతో. అలాగే 'శివమ్‌' సినిమాలో రామ్‌తో నటించింది. ఆ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయినా, మళ్లీ రామ్‌తో రెండోసారి అవకాశం చేజిక్కించుకుంది 'హైపర్‌' సినిమాలో. తాజాగా రవితేజతో మరో సినిమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా ఎంపికైంది. 'బెంగాల్‌ టైగర్‌' సినిమాలో రవితేజతో రొమాన్స్‌ చేసింది బొద్దుగుమ్మ రాశీఖన్నా. రవితేజ కూడా ఈ ముద్దుగుమ్మతో రెండోస్సారి అంటున్నాడంటే ఏ మాయ చేస్తుందో అమ్మడు హీరోలని అని చెవులు కొరుక్కుంటున్నారు ఫిల్మ్‌ నగర్‌ వర్గాలు. జయాపజయాలతో సంబంధం లేకుండా, రాశీఖన్నాకి పిలిచి మరీ అవకాశాలు కట్టిపెడుతున్నారు మన టాలీవుడ్‌ హీరోలు. ఏం మ్యాజిక్‌ ఉందో ఈ ముద్దుగుమ్మలో మరి. తెలుగుతోపాటు, తమిళంలోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతున్న రాశి ఖన్నాకి ఆల్‌ ది బెస్ట్‌. 

మరిన్ని సినిమా కబుర్లు
nagarujuna great achivment