Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
uttarakhand

ఈ సంచికలో >> శీర్షికలు >>

20-10-2017 నుండి 26-10-2017 వరకు వారఫలాలు - శ్రీకాంత్

మేష రాశి : ఈ వారం  మొత్తం మీద మిత్రులను కలుస్తారు. వారితో మీ ఆలోచనలను పంచుకుంటారు. స్వల్పదూరప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. కుటుంబసభ్యులనుండి నూతన విషయాలు తెలుస్తాయి. వారితో చర్చలు చేయునపుఁడు వివాదాలకు అవకాశం ఇవ్వకండి. పెద్దలతో మీ ఆలోచనలను పంచుకుంటారు. నూతన ప్రయత్నాలు మొదలు పెట్టునపుడు ప్రణాళిక, స్పష్టత ఉండుట వలన లబ్దిని పొందుతారు. సంతానం వలన నలుగురిలో ఆశించిన మేర గుర్తింపు లభిస్తుంది. రావాల్సిన ధనం చివరి నిమిషంలో అందుటకు అవకాశం కలదు. నూతన పెట్టుబడులకు ఆస్కారం కలదు. 

 

 

 వృషభ రాశి :  ఈవారం మొత్తంమీద విదేశాల్లో ఉన్న మిత్రులతో చర్చలు చేయుటకు అవకాశం కలదు. కుటుంబంలో సభ్యులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. సర్దుబాటు విధానం మంచిది. సంతానం వలన కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం కలదు. విషయంలో తీసుకొనే నిర్ణయాల గురించి అనుభవజ్ఞులతో చర్చలు చేయుట సూచన. మానసికంగా ఒత్తిడి పెరుగుటకు అవకాశం ఉంది. వారాం చివర్లో కాస్త సానుకూల ఫలితాలు రావడం ఊరట. గతకొంతకాలంగా ఊరిస్తున్న విదేశీప్రయాణాలు సానుకూలపడుతాయి. సాధ్యమైనంత వరకు అనవసరమైన ఖర్చులను తగ్గించుకొనే ప్రయత్నం చేయుట సూచన.  

 


మిథున రాశి :  ఈ వారం మొత్తంమీద వినోదలలో పాల్గొనటానికి ఆసక్తి చూపిస్తారు, మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. వారితో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. పెద్దలతో ఆలోచనలను పంచుకుంటారు. ఉద్యోగంలో కాస్త పనిఒత్తిడి పెరుగుటుకు అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలుచేయుటకు ఆస్కారం ఉంది. నూతన వాహనములు కొనుగోలు చేస్తారు. సోదరులతో గతంలో చేసిన చర్చలు ఫలితాలను కలుగజేస్తాయి. విదేశీప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వాటిలో ఫలితాలు రావడం సంతోషించదగిన విషయం. 

 

 

కర్కాటక రాశి : ఈవారం మొత్తం మీద ముఖ్యమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే ఆస్కారం కలదు. దూరప్రదేశప్రయాణాలు చేస్తారు. పెద్దలతో మీకున్న పరిచయం మరింత బలపడుతుంది, వారి సూచనల మేర ముందుకు వెళ్ళండి,మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో పెద్దల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆత్మీయుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. తందితరుపు బంధువులలో ఒకరిఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది. 

 

 


 సింహ రాశి : ఈవారం మొత్తం మీద మిత్రులతో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. నూతన పరిచయాలకు అవకాశం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు ప్రయత్నం చేయుటకు ఆస్కారం ఉంది. ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. నలుగురిని కలుపుకొని వెళ్ళుట సూచన. కుటుంబంలో మొండినిర్ణయాలు తీసుకొనే ఆస్కారం ఉంది. సంతానం గురుంచి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కావల్సిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. విదేశీప్రయాణాలు చేయుటకు చేసే ప్రయత్నాలు ఆశించిన మేర ఫలితాలు ఇస్తాయి.   

 


కన్యా రాశి :  ఈవారంలో ఆర్థికపరమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకొనే ముందు పెద్దలను సంప్రదించుట మంచిది. అనుకోకుండా చేసే ప్రయాణాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. వ్యాపారపరమైన విషయంలో కాస్త రహస్యంగా ఉండుట సూచన. సాధ్యమైనంత మేర ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా ఇబ్బందులు తగ్గుతాయి. బంధువుల నుండి లేక మిత్రులనుండి వచ్చిన సమాచారం మీకు పెద్దగా కలిసి రాకపోవచ్చు. నూతన ఉద్యోగం లేక వృత్తి విషయంలో స్పష్టమైన ఆలోచనలు కలిగి ఉండుట , కీలకమైన నిర్ణయాల దిశగా ఆలోచనలు చేయుట మంచిది. చర్చలకు అవకాశం ఇవ్వకండి.  

 

 


తులా రాశి : ఈవారం మొత్తంమీద నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుతారు. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేస్తారు, కాకపోతే మిత్రుల సహకారం తీసుకోవడం వలన త్వరగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఆత్మీయుల నుండి ఆశించిన విధంగా నూతన విషయాలు తెలుస్తాయి. సంతానపరమైన విషయాల్లో కొంత ఒత్తిడి తప్పక పోవచ్చును. వ్యాపారపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. బంధువులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. ఊహించని విధంగా ప్రయాణాలు వాయిదాపడే అవకాశం ఉంది. ప్రయాణాల విషయంలో స్పష్టమైన ప్రణాళిక అవసరం.

 

 

వృశ్చిక రాశి : ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో అధికారుల నుండి పనిఒత్తిడిని కలిగి ఉంటారు. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవాకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో బాగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. సోదరులతో చేపట్టిన చర్చలు పూర్తిస్థాయి ఫలితాలాను ఇవ్వకపోవచ్చును. కుటుంబపరమైన విషయాల్లో దూరద్రుష్టిని కలిగి ఉండి, బాగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. విలువైన వస్తవుల వలన ఇబ్బందులు తప్పక పోవచ్చును, వాటి విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. మిత్రులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. 

 

 

ధనస్సు రాశి : ఈవారం మొత్తం మీద బంధువులను కలుసుకునే అవకాశం ఉంది. వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశము ఉంది. ముఖ్యంగా వ్యాపారపరమైన విషయాల్లో వారితో కలిసి ఆరంభించే అవకాశం ఉంది. గతంలో మీకు రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. ఉద్యోగంలో అధికారుల నుండి పనిఒత్తిడి పెరుగుటకు అవకాశం ఉంది. ఆరోగ్యం, భోజనం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. పెద్దలతో మీకు ఉన్న సాన్నిహిత్యం మరింత పెరిగేలా ప్రయత్నం చేయుట మంచిది. 

 మకర రాశి : ఈ వారం మొత్తంమీద సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. కుటుంబంలో మీరు తీసుకొనే నిర్ణయాలను మరొకసారి పెద్దలతో పంచుకొనే ప్రయత్నం చేయుట మంచిది. నూతన వ్యాపార విషయాల్లో కాస్త ఆచితూచి వ్యవహరించుట సూచన. మీ మాటతీరు మూలాన నూతన వివాదాలకు కారణమ్ అయ్యే ఆస్కారం ఉంది. దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందిపడుతున్న వారై మరింత జాగ్రత్తలు తీసుకోవడం సూచన. పూజాదికార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యంగా స్త్రీ పరిచయాల వలన అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది , జాగ్రత్త. 

 


కుంభ రాశి : ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో ఆశించిన మేర సహకారం లభిస్తుంది. అధికారులతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. బంధువులతో కలిసి ముఖ్యమైన చర్చలు చేయుటకు ఆస్కారం ఉంది. నూతన వ్యాపారాలు చేయుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. నూతన పెట్టుబడుల విషయంలో సానుకూలఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో తండ్రి తరుపు బంధువుల నుండి సహాయం అందుతుంది.   

 

 

మీన రాశి : ఈవారం మొత్తంమీద మిత్రులతో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో పెద్దలతో చర్చలకు అవకాశం ఉంది. పెద్దలతో కలిసి మీరు చేసిన చర్చలు మంచి ఫలితాలు వస్తాయి. మీ మాటతీరును సరిచుసుకోవడం వలన చిన్న చిన్న ఇబ్బందులు తగ్గుటకు ఆస్కారం ఉంది. అధికారుల నుండి రావాల్సిన సహకారం లభిస్తుంది. ఆరోగ్యంలో ఏమాత్రం అశ్రద్ధచూపిన ఇబ్బందులు తప్పక పోవచ్చును, జాగ్రత్త. విదేశాలలో ఉన్న మిత్రులతో మీకున్న సంభందాలు మెరుగుపడతాయి. చర్చలకు అవకాశం ఉంది,స్పష్టమైన ప్రణాళిక అవసరం. 

 

మరిన్ని శీర్షికలు
temples home