Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

డియర్‌ కామ్రేడ్‌ చిత్రసమీక్ష

dear comrade movie review

చిత్రం: డియర్‌ కామ్రేడ్‌ 
నటీనటులు: విజయ్‌ దేవరకొండ, రష్మిక మండన్న, రావు రమేష్‌, సుకన్య, శ్రుతి రామచంద్రన్, చారు హాసన్, సుహాస్ తదితరులు 
ఎడిటింగ్‌: శ్రీజిత్ సారంగ్
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
నిర్మాతలు: యష్ రంగినేని, నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి
నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్‌, బిగ్ బెన్ సినిమాస్
దర్శకత్వం: భరత్‌ కమ్మ 
విడుదల తేదీ: 26 జులై 2019 
క్లుప్తంగా చెప్పాలంటే.. 
చైతన్య అలియాస్‌ బాబీ (విజయ్‌ దేవరకొండ) కాలేజ్‌ స్టూడెంట్స్‌ గ్యాంగ్‌లో చాలా యాక్టివ్‌ మెంబర్‌. గొడవలతో సావాసం చేస్తుంటాడు. అపర్ణ అలియాస్‌ లిల్లీ (రష్మిక మండన్న) ఓ పెళ్ళి నిమిత్తం, బాబీ పక్కింట్లో దిగుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. అయితే, ఎప్పుడూ బాబీ గొడవలు పడుతూనే వుండడం లిల్లీకి నచ్చదు. రెబల్‌ భావాలున్న బాబీ, తన ఆటిట్యూడ్‌ని మార్చుకోలేకపోతాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా ప్రేమ బంధం తెగిపోతుంది. ఒకరికొకరు దూరమయ్యాక, ఇద్దరూ ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నారు.? తిరిగి ఇద్దరూ ఒక్కటయ్యారా.? లేదా.? బాబీ తన వ్యవహారశైలిని మార్చుకున్నాడా.? లిల్లీ, తాను ప్రేమించిన వ్యక్తిని అర్థం చేసుకుందా.? లేదా.? వంటి ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది. 

మొత్తంగా చెప్పాలంటే.. 
విజయ్‌ దేవరకొండని బాబీ పాత్రలో చూస్తే, అర్జున్‌ రెడ్డి గుర్తుకొస్తాడు. ఆటిట్యూడ్‌ అయితే అచ్చంగా అదే కావడంతో, నటనలో కొత్తదనం ఏమాత్రం కన్పించదు. కానీ, నటుడిగా వంక పెట్టలేని రీతిలో నటనా ప్రతిభను చాటుకున్నాడు విజయ్‌ దేవరకొండ. సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోసేందుకు ప్రయత్నించాడు. ఆటిట్యూడ్‌ చూపడంలో కావొచ్చు, రొమాంటిక్‌ సీన్స్‌లో కావొచ్చు.. విజయ్‌ దేవరకొండ నటన సూపర్బ్‌. 

రష్మిక మండన్న విషయానికొస్తే, చూడగానే ఎట్రాక్ట్‌ చేసే క్యూట్‌ అప్పీల్‌ ఆమె సొంతం. నటనలోనూ ఆమెకు వంక పెట్టలేం. హావభావాలతో ఆకట్టుకుంది. అన్ని ఎమోషన్స్‌తోనూ కట్టి పడేసింది. నటనలో విజయ్‌కి పెర్‌ఫెక్ట్‌ జోడీ అని ఇంకోసారి ప్రూవ్‌ చేసుకుంది రష్మిక మండన్న. మిగతా పాత్రధారులంతా తమ తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు. 

కథ పరంగా చూస్తే, మరీ కొత్తగా ఏమీ అన్పించదు. ఎందుకంటే చాలా సినిమాల్లో చూసేశాం. నెరేషన్‌ కూడా బావుంది. అయితే, చాలా ఇష్యూస్‌ ఒకే కథలో దర్శకుడు జొప్పించేయడం కొంత కన్‌ఫ్యూజన్‌కి కారణమయ్యింది. మాటలు బావున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా చాలా బావుంది. మ్యూజిక్‌, బ్రాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా ఆకట్టుకుంటాయి. నిర్మాణపు విలువల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ సినిమాకి అవసరమైన మేర హెల్ప్‌ అయ్యాయి. ఎడిటింగ్‌ విషయంలోనే ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంది. కొన్ని సాగతీత సన్నివేశాలకు కత్తెర చాలా అవసరం అనిపిస్తుంది. 

హీరోకి కోపమెక్కువ.. ఆ కోపం కారణంగా హీరోయిన్‌కి దూరమయ్యే హీరో.. ఈ కథతో సినిమాలు చాలానే వచ్చాయి గతంలో. అయితే, ఇక్కడ విజయ్‌ దేవరకొండ మార్క్‌ వుంది గనుక.. ఆ యాటిట్యూడ్‌ని పెర్‌ఫెక్ట్‌గా అతను ప్రెజెంట్‌ చేయగలడు గనుక, అటువైపు రష్మిక మండన్న కెమిస్ట్రీ ఆల్రెడీ ప్రూవ్డ్‌ గనుక.. సేలబుల్‌ కంటెంట్‌ అని దర్శకుడు ఫిక్స్‌ అయి వుంటాడు. అది నిజం కూడా. అయితే, ఈ క్రమంలో వేరే వేరే విషయాల జోలికి వెళ్ళి, కథనం నెమ్మదించేలా, ఆ మాటకొస్తే అక్కడక్కడా తానే తడబడిపోయేలా ఇబ్బంది పడ్డాడు దర్శకుడు. విజయ్‌, రష్మిక తమ పెర్ఫామెన్స్‌లతో సినిమాని గట్టెక్కించేందుకు ప్రయత్నించారు. సంగీతం, సినిమాటోగ్రఫీ వారి ప్రయత్నానికి పూర్తిగా సహకరించాయి. 'సాగతీత' అనే ఒక్క విషయాన్ని పక్కన పెడితే, ఈ సినిమాలో యూత్‌ని ఆకట్టుకునే అంశాలు చాలానే వున్నాయి. ఓవరాల్‌గా అభిమానులకు 'డియర్‌' అన్పించే ప్రోడక్ట్‌నే విజయ్‌ ఇచ్చాడని అనుకోవచ్చు. 'రౌడీ' మేనియా కలిసొస్తే, బాక్సాఫీస్‌ వద్ద బాగానే ఫేర్‌ చేసే అవకాశాలున్నాయి ఈ కామ్రేడ్‌కి.

అంకెల్లో చెప్పాలంటే.. 

3/5 

ఒక్క మాటలో చెప్పాలంటే... 
డి...య..ర్‌... కా..మ్రే..డ్‌.!
మరిన్ని సినిమా కబుర్లు
churaka