Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
audience disappionted this summer

ఈ సంచికలో >> సినిమా >>

ఈమె కెరీర్‌ కూడా పదేళ్ళు దాటింది

Her career crossed  ten years...

‘హాయ్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన అందాల భామ నిఖిత, పదేళ్ళ కెరీర్‌ని పూర్తి చేసుకుంది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే పన్నెండేళ్ళకు పైనే అయ్యింది నిఖిత సినిమాల్లోకి వచ్చి. తెలుగులో ‘సంబరం’ వంటి కొన్ని సినిమాలు చేసిన నిఖిత, కన్నడ, తమిళ, మలయాళ సినిమాల్లో కూడా నటించి పేరు తెచ్చుకుంది. కెరీర్‌ ఇక ముగిసినట్టేనని అనుకుంటున్న ప్రతిసారీ మంచి అవకాశాలతో దర్శక నిర్మాతలు ప్రోత్సహిస్తుండడంతో కెరీర్‌కి బ్రేక్‌ ఇవ్వాలని ఎప్పుడూ అనుకోలేదంటున్న ఈ అందాల భామకి, తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ అవలేకపోయానన్న బాధ అప్పుడప్పుడూ కలుగుతుందట. ఐటమ్‌ సాంగ్స్‌ చేయడానికి కూడా నిఖిత వెనుకాడదు. సుశాంత్‌ హీరోగా తమన్నా హీరోయిన్‌గా నటించిన ‘కాళిదాసు’ సినిమాలో నిఖిత ఐటమ్‌ సాంగ్‌ చేసింది. విశాల్‌తో ఓ సినిమాలో ఐటమ్‌ సాంగ్‌ చేస్తోంది నిఖిత. వెనక్కి తిరిగి చూసుకుంటే కెరీర్‌లో పన్నెండేళ్ళు ఉన్నాననే గర్వం కలుగుతుందని చెబుతుంది నిఖిత.

మరిన్ని సినిమా కబుర్లు
adventure in telugu