Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Her career crossed  ten years...

ఈ సంచికలో >> సినిమా >>

తెలుగులో అది చేస్తే సాహసమే

adventure in telugu

హిందీలో ‘మేరీకోమ్‌’ సినిమా సంచలన విజయం సాధించింది. బాక్సర్‌ మేరీకోమ్‌ జీవితం ఆధారంగా తీసిన సినిమా ఇది. ఇందులో ప్రియాంకా చోప్రా ‘మేరీకోమ్‌’గా నటించి ప్రేక్షకుల్ని, విమర్శకుల్ని మెప్పించింది. అలాంటి సినిమా తెలుగులో కూడా ఒకటి వచ్చేలా ఉంది. బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌ జీవితం ఆధారంగా సినిమా చేయాలని ఉందని సూపర్‌ స్టార్‌ కృష్ణ అల్లుడు, ‘ఎస్‌ఎంఎస్‌’, ‘ప్రేమ కథా చిత్రమ్‌’ సినిమాల హీరో సుధీర్‌బాబు చెప్పడం చూస్తుంటే, తెరవెనుక సినిమా కోసం సన్నాహాలు జరుగుతున్నాయేమో అనిపిస్తుంది. పుల్లెల గోపీచంద్‌ కష్టపడి పైకొచ్చిన స్పోర్ట్స్‌ స్టార్‌ అని చెబుతూ, అలాంటి గొప్ప వ్యక్తుల జీవితాల్ని తెరపై ఆవిష్కరిస్తే, యువతకు మంచి మెసేజ్‌ ఇచ్చినట్లవుతుందని అంటున్నాడు సుధీర్‌బాబు. చాలా మంచి ఆలోచన ఇది. ఈ ఆలోచనకు తెర రూపం కల్పిస్తే తెలుగు తెరపై అదో పెద్ద సాహసం అవుతుంది. ఆల్‌ ది బెస్ట్‌ సుధీర్‌బాబు. తాను నటించిన ‘మోసగాళ్ళకు మోసగాడు’ సినిమా విడుదల పనుల్లో సుధీర్‌బాబు క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. మావయ్య కృష్ణ నటించిన సూపర్‌ హిట్‌ సినిమా టైటిల్‌తో చేస్తున్న ‘మోసగాళ్ళకు మోసగాడు’ ఈ తరం ఆడియన్స్‌ని అలరిస్తుందని సుధీర్‌బాబు ధీమాగా చెప్పాడు.

మరిన్ని సినిమా కబుర్లు
Is Child artist as father