Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Is Child artist as father

ఈ సంచికలో >> సినిమా >>

‘జ్యోతిలక్ష్మి’తో ఛార్మి సాధించేసింది

charmi with jyoti lakshmi

విడుదలకు ముందే సినిమా గురించి ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో మంచి చర్చ జరుగుతుందంటే ఆ ప్రాజెక్ట్‌ టేకప్‌ చేసినవారంతా సక్సెస్‌ అయినట్టే భావించాలి. ‘జ్యోతిలక్ష్మి’ సినిమాతో ఛార్మి ఆ ఘనతను సాధించేసింది. ఈ సినిమాకి ఛార్మి సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తుంది. సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకి పూరి జగన్నాథ్‌ దర్శకుడు. స్టార్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, ఛార్మితో సినిమా ప్రకటించగానే బయ్యర్స్‌ నుంచి ఎంక్వయిరీలు బాగా జరిగాయి. సినిమాని శరవేగంగా దర్శకుడు పూర్తి చేయడంతో, సినిమాపై నమ్మకాలు ఇంకా పెరిగిపోయాయి. ట్రైలర్‌ వచ్చాక సినిమా గురించి ఇంకా పాజిటివ్‌ టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది. సోలో హీరోయిన్‌గా సినిమాలు చేయడం ఛార్మికి కొత్త కాదు. ‘అనగనగా ఒక రోజు’, ‘మంత్ర’ వంటి ఎన్నో సినిమాలు చేసింది ఛార్మి. వాటన్నిటినీ మించి ‘జ్యోతిలక్ష్మి’ సంచలన విజయం సాధించనుందేమో. సినిమా టాక్‌ ఎలా ఉన్నా ఓపెనింగ్స్‌తోనే సినిమా సేఫ్‌ వెంచర్‌ అవుతుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondichooddaam