Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
adventure in telugu

ఈ సంచికలో >> సినిమా >>

తండ్రిలానే బాల నటుడిగా వస్తాడా?

Is Child artist as father

స్వర్గీయ నందమూరి తారకరామారావు మనవడు జూనియర్‌ ఎన్టీఆర్‌ బాల నటుడిగానే తెలుగు సినిమాల్లోకి వచ్చాడు. జూనియర్‌ ఎన్టీఆర్‌ తన కుమారుడితో దిగిన ఫొటోల్ని తన పుట్టినరోజున విడుదల చేసేసరికి ప్రతి ఒక్కరూ, ‘ఈ కుర్రాడు కూడా బాల నటుడిగానే తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెడతాడా?’ అని చర్చించుకున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ కుమారుడి పేరు అభయ్‌ రామ్‌. స్వర్గీయ నందమూరి తారకరామరావు నుంచి నటనా వారసత్వాన్ని పుచ్చుకున్నవారిలో బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌, తారకరత్న తదితరులున్నారు. బాలకృష్ణ కుమారుడు కూడా సినిమాల్లో నటించడానికి సిద్ధమవుతున్నాడట. తనయుడి తెరంగేట్రం గురించి బాలకృష్ణ కూడా స్పష్టతనిచ్చారు. 2016 లేదా 17లో తన కుమారుడు సినిమాల్లోకి వస్తాడని బాలకృష్ణ చెప్పారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ కుమారుడు ఇంకా చాలా చిన్నోడే కాబట్టి, తండ్రిలా బాల నటుడిగా కనిపిస్తే నందమూరి అభిమానులకు అది పండగే అవుతుందనడం నిస్సందేహం.

మరిన్ని సినిమా కబుర్లు
charmi with jyoti lakshmi