Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview with sandeep kishan

ఈ సంచికలో >> సినిమా >>

చిన్నప్పుడు నల్లగా ఉండేదట

black beauty

సాధారణంగా అమ్మాయిలకు శరీర ఛాయ మీదున్న ఇంట్రెస్ట్‌ అందరికీ తెలిసిందే. నల్లగా ఉన్న అమ్మాయిని అందంగా ఉందా లేదా అని అడిగితే నల్లగా ఉన్నా కళగా ఉందిలే అని సరిపెట్టి సమాధానమిస్తారు. కానీ కొంచెం తెల్లగా ఉన్న అమ్మాయిని చూపించి ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుంది. తెల్లగా కూడా ఉంది అని ఠక్కున సమాధానమిచ్చేస్తారు. అయితే ఇదే విషయం మన మంచు వారమ్మాయి లక్ష్మినడిగితే తనకు నలుపు ఛాయంటేనే ఇష్టమంటోంది. పైగా తను చిన్నప్పుడు నల్లగానే ఉండేదాన్ని అని కూడా చెబుతుంది. వయసు పెరిగే కొద్దీ తన శరీర ఛాయ కూడా మారి ఇప్పుడు తెల్లగా అయ్యిందట. అమెరికాలో ఉన్నపుడు ఎప్పుడూ తనకు శరీర ఛాయతో ఇబ్బందదది రాలేదట. కానీ ఇక్కడికొచ్చిన తరువాతనే ఇబ్బంది వచ్చిందట.

ఎప్పుడైనా అలసిపోయి కొద్దిగా ముఖంలో తాజాదనం కోల్పోతే వెంటనే తనను చూసిని బంధువులు ఏంటి ఇలా నల్లబడ్డావు. పలానా ఫేస్‌ క్రీంలు వాడవచ్చు కదా అని ఉచిత సలహాలు ఇచ్చేస్తూ ఉంటారట. అందుకేనేమో మన దేశంలో ఫెయిర్‌నెస్‌ క్రీంలకు అంత గిరాకీ ఉంది. ఏది ఏమైనా అమ్మాయి ఏ రంగులో ఉన్నా ఒక ప్రత్యేకమైన అందం ఉంటుంది. అయితే ఎవరికి వారు తాను కూడా అందంగానే ఉన్నానన్న ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి అని అందం గురించి మంచి సలహా ఇచ్చింది. ఈ మంచు వారమ్మాయి చిన్నప్పుడు నల్లగా ఉందో లేదోగానీ ఇప్పుడుతై ‘నల్ల’ అమ్మాయే (తమిళంలో నల్ల అంటే మంచి).

 

మరిన్ని సినిమా కబుర్లు
tall in class