Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
same heroine for both

ఈ సంచికలో >> సినిమా >>

పాత్ర నాకు నప్పితే తప్పకుండా చేస్తా

sure if character suit for me

ప్రస్తుతం ‘బాహుబలి’ సినిమాలో రాజకుమారి అవంతికగా నటిస్తున్న తమన్నా ఒకేసారి టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ దృష్టిని తనవైపుకు తిప్పుకుంది.ఈ సినిమా అన్ని భాషల్లోనూ విడుదలవుతుండడంతో తమన్నాకి విపరీతమైన పబ్లిసిటీ వచ్చిపడ్తోంది. అందునా ‘అవంతిక’గా తమన్నా అత్యంత అందంగా కన్పిస్తోంది మరి. ఏదన్నా సినిమాకి ఒప్పుకోవడంలో దేనికి ప్రాధాన్యతనిస్తారు? అని ప్రశ్నిస్తే, తనకు దర్శకులు చెప్పిన కథల్లోని పాత్రలు తనకు నప్పితే వెంటనే ఒకే చెప్పేస్తా అంటుంది మిల్కీ బ్యూటీ తమన్నా.

అవకాశాలనేవి మనం మెచ్చినట్లు రావనీ, వచ్చిన అవకాశాన్నే తగిన విధంగా ఉపయోగించుకోవాలని తమన్నా చెబుతుంది.  ఏ కథకి సంబంధించిన పాత్రనయినా తక్కువ చేసి చూడకుండా, అది మన వరకూ వచ్చినప్పుడు దానికి మనం ఎంతవరకూ న్యాయం చేయగలం అనేది మాత్రమే ఆలోచించాలి అంటున్న తమన్నా, ప్రస్తుతం ‘బెంగాల్‌ టైగర్‌’తో పాటు నాగార్జున, కార్తీ చిత్రంలోనూ నటిస్తోంది. ఎప్పటికప్పుడు నటనలో వైవిధ్యం, పరిణితి ప్రదర్శిస్తూ, వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటానంటోంది మిల్కీ బ్యూటీ. అదే తమన్నా సక్సెస్‌ సీక్రెట్‌ అట.

 

మరిన్ని సినిమా కబుర్లు
anushtanam talkee completed