Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
black beauty

ఈ సంచికలో >> సినిమా >>

క్లాసులో అందరి కంటే తనే పొడగట

tall in class

‘1 నేనొక్కడినే’ లో మహేష్‌తో జతకట్టి, తరువాత ‘దోచేయ్‌’లో నాగచైతన్యతో ఆడి పాడిన పొడుగు కాళ్ల సుందరి కృతి సనన్‌ తన హైట్‌తో గ్లామర్‌తో యువతను బాగా ఆకర్షించింది. ‘నేనొక్కడినే’లో మహేష్‌ పక్కన జోడీ అదుర్స్‌ అనిపించేలా ఆమె పర్సనాలిటీతో మార్కులు కొట్టేసింది. పొడగరి హీరోల పక్కన కృతి సనన్‌ బాగా సూటయిపోతుంది. ఈమె చదువుకునే రోజుల్లో క్లాసులో అందరికంటే పొడుగట. తోటి స్నేహితులంతా ఆమె హైట్‌ చూసి అసూయపడేవారట. కొంతమంది స్నేహితులు కృతి పర్సనాలిటీని చూసి మోడలింగ్‌లో బాగా రాణిస్తావని సలహాలు కూడా ఇచ్చేవారట.

వారి సలహాలు పాటించి, ఇంటర్‌ సెకండియర్‌లో ఉండగా మొట్టమొదటిసారి మోడలింగ్‌వైపు అడుగుపెట్టిందట. బీటెక్‌ పూర్తయ్యే వరకూ ఢల్లీిలో మోడలింగ్‌ చేసిందట. ఓ పక్క చదువు, ఇంకోపక్క మోడలింగ్‌ రెండు పడవల ప్రయాణం బాగానే సాగించింది. టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లోనూ మంచి అవకాశాలు దక్కించుకుంది. అప్పటివరకూ సాధారణ మోడల్‌గా ఉన్న తనకు మహేష్‌తో సినిమా చేసే ఛాన్స్‌ రావడంతో దశ తిరిగిపోయిందట. మహేష్‌తో బోణీ మొత్తానికి ఈ భామకి బాగానే ఉన్నట్లుంది. ఈమె ఇలాగే మరిన్ని సినిమాలు చేసి కుర్రకారుని ఉర్రూతలూగించాలని ఆశిద్దాం.

 

మరిన్ని సినిమా కబుర్లు
reasons for anushka's beauty