Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఇంత రచ్చ అవసరమా... - .భమిడిపాటి ఫణిబాబు

inta raccha avasaramaa..

ఉద్యోగంలో ఉన్నప్పుడు, ఇంట్లో ఏవో చికాకులొచ్చి, ఆఫీసుకి వెళ్ళి, ఏ కారణం లేకుండా, ఎవడిమీదో ఆ చిరాకు ప్రదర్శిస్తూ, చడా మడా కోప్పడేయడం. పాపం అవతలివాడు ఎప్పుడూ బాగా పని చేసేవాడే, కానీ, అదృష్టం బాగోక, ఈ ఇంట్లో చికాకులొచ్చిన పెద్దమనిషి చేతిలో బలైపోతాడు.ఈ పెద్దమనిషి కొద్దిగా ఇంగితజ్ఞానం ఉన్నవాడైతే, తను చేసిన తప్పు తెలిసికుని, ఆ అవతలివాడిని పిలిచి, సద్దిచెప్తాడు. కాదూ  ఎవడెలా పోతే మనకేమిటిలే అనుకునే వాడైతే, తన పట్టు వదలడు. దీనితో ఇద్దరి మధ్యా సంబంధ బాంధవ్యాలు  strain అయిపోతాయి.అలాగని జీవితాంతం తెలిసికోకుండా ఉంటాడంటారా, అబ్బే ఎప్పుడో ఒకప్పుడు తెలిసికుంటాడు. But it is too late..

ఇలాటివి ఊళ్ళో వాళ్ళతో ఉండే వ్యవహారాలు. కానీ ఒక్కోక్కప్పుడు, భార్యా భర్తల మధ్యే ఇలాటివి తలెత్తుతూంటాయి. అప్పుడప్పుడేమిటిలెండి,   ఎప్పుడు పడితే అప్పుడే, తేరగా, లోకువగా దొరికేది కట్టుకున్న పెళ్ళామేగా.. మన " బక్క కోపం" అంతా ఆ poor soul మీద చూపించేసికోడం. ఆ కోపంలో ఏం మాట్టాడుతున్నామో కూడా తెలియదు.ఒళ్ళు తెలీకుండా చడా మడా అరవడం. ఒక్కోసారి, ఎప్పటినుంచో దాచుకున్న " కచ్చి" అంతా మాటల రూపంలో చూపించేయడం. ఓ అర్ధం పర్ధం ఉండదు. అనుకుంటూంటాను, ఎప్పుడో ఎవరికో ఇలాటి పరిస్థితి వచ్చినప్పుడు, ఏ రికార్డింగో చేసి చూపిస్తే ఎలా ఉంటుందో అని.  ఛాన్సొస్తే  ఈ రోజుల్లో వెళ్ళే Counselling చేసేవాళ్ళందరిదగ్గరా ఇలాటివే ఉంటాయేమో. లేకపోతే అన్నన్ని సలహాలెక్కడ ఇస్తారూ? అయినా చెప్పేవాడికి వినేవాడెప్పుడూ లోకువే. ఏదో  ఫీజు పుచ్చుకున్నందుకు ఏదో సలహా ఇస్తాడు. ఈమధ్యన టీవీల్లో కూడా అవేవో  కార్యక్రమాలు మొదలయ్యాయి. అసలు ఇంటిగొడవ రచ్చకెందుకీడుస్తారో తెలియదు. సినిమాల్లో ఛాన్సులైపోయిన నటీమణులందరూ ఇక్కడ యాంకర్లు. ఆ కార్య్క్రమాలు చూస్తూంటే నవ్వాలో ఏడవాలో తెలియదు. ఈ యాంకర్లనబడే ప్రాణులు, తామేదో గొప్ప  స్థితిలో ఉన్నట్టు, ఇంకోరి కాపరాలు చక్కబెట్టే ప్రయత్నాలు చేయడం. ఏదో టీవీల్లో కనిపించాలనే యావ తప్ప, వాతావరణం అంతా కృత్రిమంగా కనిపిస్తుంది. పైగా ఓ చానెల్ ని చూసి మిగిలినచానెళ్ళూ మొదలెట్టాయి. ఈ  so called counseling.

ఈ రోజుల్లో ఎక్కడ చూసినా అవేవో equality లూ, సింగినాదాలూనూ. భార్యాభర్తలిద్దరూ సంపాదనాపరులే. వెధవ్వేషాలేస్తే, నీ దిక్కున చోట చెప్పుకో ఫో.. అనేసి, బిచాణా కట్టేసి వెళ్ళిపోతుంది.అలాగని నేనేదో సంపాదనాపరుణ్ణీ, మా ఇంటావిడ కేమీ సంపాదనలేదూ, అందువలన అణిగి మణిగి ఉందీ అనుకుంటే, తనని కించపరిచినట్టే. ఒక్కోళ్ళ స్వభావాలు అలాగే ఉంటాయి." ఫొనిద్దూ.. అరిచి అరిచి ఆయనే నోరుమూసుకుంటాడూ..". పిల్లలేడుస్తూంటే ఏదో ఒక్కసారి దగ్గరకు తీసికుంటారు. కానీ అదే ఓ weapon లాగ ఉపయోగిస్తూంటే, their place is shown..ఎన్నిచెప్పండి, మా ఇంటావిడ ఇంకా నా place నాకు చూపించలేదు    సినిమాల్లో చూస్తూంటాము- హీరోలకి కోపాలూ తాపాలూ వచ్చినప్పుడు, అవేవో punching bags ట, వాటిమీద టపా..టపా ..కొట్టేస్తూంటారు.ఇప్పుడున్న ఎపార్ట్మెంటుల్లో ఈ punching bags లకీ వాటికీ చోట్లెక్కడా, ఏదో డైనింగ్ టేబుల్ నో ,ఓ గోడనో కొట్టేసికుంటే సరి ! అదికూడా చక్కతో చేసిన డైనింగ్ టేబుల్ అయితే ఫరవాలేదు. ఏ గ్లాసుదో అయితే మళ్ళీ గొడవా, విరిగూరుకుంటుంది. చూసుకుని మరీ చేయండి. కాదంటారా, పిల్లాడికి ఏవో మార్కులు తక్కువొచ్చాయనో,అసలు చదువు గురించి పట్టించుకోకుండా టీవీ చూస్తూంటాడనో, ఓ నాలుగు దెబ్బలేసేయండి. తరువాత దగ్గరకు తీసికుని ఓ చాకొలేట్ కొనేసియ్యండి. ఇలాటివైతే మన దేశంలో గొడవుండదు. బయటి దేశాల్లో అయితే మళ్ళీ ఆ పిల్లలు పోలీసులకి ఫోను చేస్తారుట. వామ్మోయ్ మళ్ళీ ఇదో గొడవా. ఇక్కడే హాయి.. అందుకే అంటారు.. "మేరా భారత్ మహాన్..". ఏదో నాలుగు దెబ్బలు తిన్నా ఓ చాకొలేట్ తో గొడవొదిలిపోతుంది...మన కోపమూ చల్లారుతుంది..

అందరిలోకీ రాజకీయనాయకుల పని హాయి. అవతలి పార్టీ వాడిమీద కోపం వచ్చినప్పుడు అవాకులూ చవాకులూ మీడియా వాళ్ళని పిలిచి మరీ వాగేస్తాడు.ఎప్పుడో కొన్ని రోజులతరువాత, ఎవడిమీదైతే పేలాడో, వాడే అధికారంలోకి వస్తే, ఇంద్రుడూ చంద్రుడూ అని పొగిడేస్తాడు. అదేమిటండీ ఇదివరకు ఇంకోటేదో అన్నట్టున్నారూ అని అడిగినా, I was quoted out of  context అనేసి  ఊరుకుంటాడు.

"మమ" అనుకున్నట్టన్నమాట...అలా చూసుకుంటే ఒక్కోరికి ఒక్కోరకమైన  stress busters…

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
ilaa koodaa kesulu pettocchaa..!