Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Neck Swellings, Causes and Ayurvedic Treatments in Telugu by Dr. Murali Manohar Chirumamilla, M.D.

ఈ సంచికలో >> శీర్షికలు >>

టమాట ఉల్లి పచ్చడి - బన్ను

కావలిసిన పదార్ధాలు:  ఉల్లిపాయలు, టమాటాలు, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు,వెల్లుల్లిపాయ,  కొత్తిమీర, చింతపండు, శనగపప్పు, జీలకర్ర, ఎండు మిర్చి

తయారుచేసే విధానం: ముందుగా బాణలిలో నూనె వేసి శనగపప్పు, మినపప్పు వేసి తరువాత పచ్చిమిర్చి వేసి అవి వేగాక ఉల్లిపాయలను వేసి , వెల్లుల్లిపాయలను ఇష్టమైతే వేసుకోవచ్చు. తరువాత కొంచం  దోరగా వేగక టమాటాలు, చింతపండు, కరివేపాకు, కొత్తిమీర వేసి మగ్గనివ్వాలి. తరువాత సరిపడినంత ఉప్పును వేసి చల్లార్చాలి. చల్లారిన మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకోవాలి. తరువాత మళ్ళీ బాణాలిలో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిర్చి వేసి గ్రైండ్ చేసిన మిశ్రమం లో కలపాలి. అంతేనండీ..రుచికరమైన టమాట ఉల్లి పచ్చడి రెడీ..  

మరిన్ని శీర్షికలు
commin..comming