Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahaasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఉసిరి గురించి మనకు తెలియనివి ఎన్నో... - -హైమాశ్రీనివాస్

usiri gurinchi manaku teliyanivenno..

వన్దే వన్దారుమన్దార --- మిన్దిరాన్దకందలమ్
అమన్దానందసన్దోహ --- బన్ధురం సింధురాననమ్.
అఙ్గం హరేః పులకభూషణ మాశ్రయన్తీ --- భృంగాఙ్గనేవ ముకుళాభరణం తమాలమ్
అంగీకృతాఖిలభూతి రపాఙ్గలీలా ---  మాంగల్యాదా  స్తుమమ మఙ్గళదేవతాయాః.
ముగ్దా ముహు ర్విదధతీ వదనే మురారేః---  ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని
మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా ---  సా మే శ్రియం దిశతు సాగరసమ్భవాయాః.

--   అంటూ మొదలెట్టి ఆదిశమక్రులవారు 25శ్లోకాల్లో

స్తువన్తి యే స్తుతిభి రమూభిరన్వహం --- త్రయీమయీం త్రిభువనమాతరం రమాం
గుణాధికాం గురుతర భాగ్యభాజినో --- భవంతి తే భువి బుధభావితాశయాః

--- అంటూ ముగించగానే బంగారు ఉసిరికాయల వర్షం కురిసింది. నిజానికి ఉసిరి-సిరే అంటే  బంగారమే! . దీనిలో లభించే సీ విటమిన్ మాత్రమేకాక మిగిలిna-  ఆరోగ్యమే మహాభాగ్యంగా - చేసే  అన్నింటితోపాటు మన పాలిట సిరి. ఉసిరి అనగానే నోట్లో నీరూరుతుంది. కమ్మని పుల్లని రుచితో , నోటికి ఇంపునిచ్చే ఉసిరిఉసిరి కాయకు ఎంతో ప్రాధాన్యత ఉంది.ఈ ఉసిరి  ఒక చెట్టునుండీ  ఉసిరికాయలు లభిస్తాయి.  ఉసిరి కాయను ఆంగ్లంలో ‘ ది ఇండి యన్ గూసబెర్రీ అనీ ఫిలాంతస్ ఎంబ్లికా  అనీ, హిందీలో "ఆమ్ల' అనీ, సంస్కృతంలో "ఆమలక" అనీ అంటారు. దీనిలో విటమిన్ సి. పుష్కలంగా లబిస్తుంది. ఉసిరి కాయలను, గింజలను, ఆకులను, పూలను, వేళ్ళను, బెరడును ఆయుర్వేద ఔషధాలలో వాడతారు. ముఖ్యంగా చ్యవన ప్రాశ  ఉసిరితో తయారుచేస్తారు.- మలబద్ధకానికి ఉసిరి కాయ దివ్యౌషధం. షాంపూలో కూడ ఉసిరి కాయను వాడతారు. దీని శాస్త్రీయనామం ఫిలాంథస్ ఎంబ్లికా. ఇది ఫిలాంథిసియా కుటుంబానికి చెందిన వృక్షం. ఇది మరీ పెద్దగా, మరీ చిన్నగా కాక మధ్తస్తంగా ఎదిగే చెట్టు. ఈ చెట్టు ఆకులు చిన్నవిగా, ఆకుపచ్చ రంగులో ఉండి, కొమ్మలు విస్తరించి ఉంటాయి. దీని పువ్వులు పసుపు, ఆకు పచ్చ రంగుల సంమ్మేళనంతో ఉంటాయి. దీని కాయలు కూడా అదే రంగులో వుంటాయి. ప్రతి కొమ్మకి అధికసంఖ్యలో ఉసిరి కాయలు కాస్తాయి. వైద్య పరంగా ఉసిరిక ఎన్నో ఔషధ గుణా లున్న వృక్షం.

ఆయుర్వేదంలోను, యునానీ ఔషధాల్లోనూ విరివిగా వాడతారు. అలాగే ఈ చెట్టు కాయలు, పువ్వులు, బెరడు, వేరు అన్నీ సంపూర్ణ ఔషధగుణాలు కల భాగాలే. విటమిన్ సి, ఐ పుష్కలంగా ఉన్న ఉసిరి, జుట్టుకి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. జుట్టు రాలడం, తెల్లబడడం, చుండ్రులాంటివి రాకుండా కాపాడు తుండటాన తలనూనెలలను ఆమ్లా హేరాయిల్స్ తయారీలో వడుతున్నారు. నూనె తల భారం , తలపోటురా కుండాచేసి మెదడును చల్లబరుస్తుంది. సౌందర్యసాధనాల తయారీ లో, వంటకాలలో, మందుల్లో, ఇంకా  ఎన్నో విధాలుగా ఉపయోగిస్తున్నారు.  భారతీయులు సాంప్రదాయరీతిలో దీనిని పూజిస్తారు. దీనితో ఊరగాయలు పెట్టి ఇతర దేశాలకి ఎగుమతి చేస్తున్నారు. ఇంకుల తయారీలో, షాంపూల తయారీల్లో సాస్లు, తలకి వేసుకునే రంగుల్లో కూడా దీనిని విరివిగా వాడు తున్నారు. దీనితో తయారుచేసిన ఆమ్లా మురబా తింటే వాంతులు, విరేచనాలు తగ్గి ఎంతో ఉపశమనం చేకూరుతుంది. 

ఉసిరితో తయారు చేసిన మాత్రలు వాత, పిత్త, కఫ రోగాలకు మంచి ఔషధంగా పనిచేస్తాయి.  ఉసిరిని నిత్యం వంటల్లో లేదా ఉదయాన్నే తిన్నా మనకు మంచి శక్తి, ఆరోగ్యం వస్తుందనడంలో ఎంత మాత్రం అతిశ యోక్తి కాదు. ఉప్పు లో ఎండ బెట్టిన ఉసిరిని నిల్వచేసుకుని ప్రతిరోజు ఒక ముక్క బుగ్గన పెట్టుకుని చప్ప రిస్తూవుంటే, జీర్ణశక్తి పెరుగుతుంది. అజీర్తి రోగాన్ని నిర్మూలిస్తుంది, ఎసిడిటీ, అల్సర్ వంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. ప్రతి ఇంటిలో  ఉసిరిని పెంచితే ఆగాలికే ఆరోగ్యం లభిస్తుందని శాస్త్రజ్ఞులమాట. . భార తీయ వాస్తుశాస్త్రంలో కూడా దీనికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఇంటి పెరటిలో గనుక ఉసిరి చెట్టు ఉంటే, ఆ ఇంటి వాస్తుదోషాలు ఏవైనా ఉంటే  హరిస్తుందని జ్యోతిషశాస్త్రం, వాస్తుశాస్త్రం చెప్తున్నాయి.

ఉసిరి కాయను ఆంగ్లంలో ది ఇండియన్ గోసబెర్రీ,ఫిలాంతస్ ఎంబ్లికా అనీ అంటారు.  హిందీలో "ఆమ్ల' అనీ, సంస్కృతంలో "ఆమలక" అనీ అంటారు. ఉప్పు రుచి తప్పించి మిగిలినఐఇదు రుచులను కలిగి ఉంది . అత్యధి కం గా "సి " విటమిన్ ఉంటుంది . రోగనిరోధక శక్తి పెంచుతుంది .నారింజలో కన్నా ఉసిరి లో 20 రెట్లు ఎక్కువ గా విటమిన్ సి ఉంటుంది . యాంటీఆక్షడెంట్స్  ,ఫ్లవనాయిడ్లు ,కెరోటినాయిడ్స్ ,టానిక్ ఆమ్లం , గ్లూకోజ్ ,కాల్సి యం , ప్రోటీన్లు దీనిలో లభ్యమవుతాయి.  పువ్వులు ఆకుపచ్చ-పసుపు రంగులో ఉంటాయి.ఉసిరికాయలు గుండ్రంగా లేత ఆకుపచ్చ-పసుపు రంగులో గట్టిగా   ఉంటాయి.

ఉసిరిలో అనేక పోషక విలువలతోబాటు ఔషధ గుణములున్నందున దీనిని అమృత ఫలం అనికూడా అంటారు. ఉసిరికాయలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉన్నందున దీనితో ఆయుర్వేదంలో చ్యవన్ ప్రాస తయారుచేస్తారు. దక్షిణ భారతదేశంలో ఉసిరికాయను ఊరగాయగానూ, ఉసిరావకాయగానూ, ఉసిరి ముక్కలను అల్లం ఉప్పు వేసి ఎంఘబెట్టి ఉదయాన్నే తినడం ద్వారా జీర్ణశక్తితోపటుగా ఏవిధమైన జలుబు దబ్బు వంటివి రావు.  హిందువులు ఉసిరిచెట్టును పవిత్రంగా భావిస్తారు. కార్తీకమాసంలో వనమహోత్సవాలలోఉసిరిచెట్టు క్రింద వన భోజనం చేయడం జరుగుతుంది. ఉసిరికాయ  మలబద్ధకాన్ని తగ్గుతుంది. కంటి చూపును పెంచుతుంది. ఉసిరికాయలు బాగాలభ్యమయ్యే కాలంలో ప్రతి ఒక్కరికీ 3,4 కాయలచొప్పున, కొద్దీగా అల్లం కలిపి మిక్సీలో గ్రైండ్ చేసి వడకట్టి ఒక స్లూన్ తేనేతో త్రాగితే జలుబు దగ్గు జోలికిరవుకకదా చక్కని జీర్ణశక్తి పొంది,ఏవిధమైన ఇన్ ఫెక్షన్స్ మనజోలికిరావు.  రోగనిరోధక శక్తిని పెరుగుతుంది.అదనపు కొవ్వును కరిగిస్తుంది. షుగర్ వ్యాధి ఉన్నవారు ఉసిరి వాడితే ఇంసులిన్ ఉత్పత్తిని పెంచి రక్తంలోని చెక్కెరశాతాన్ని  తగ్గిస్తుంది.జ్ఞాపక శక్తిని పెంచు తుంది.జుట్టును నల్లగా ఉంచే శక్తిని కలిగిస్తుంది. ఉపిరి తిత్తులు ,కాలేయం , జీర్ణమండలం , గుండె పనితీరును నియంత్రిస్తుంది. ఆస్తమా ,బ్రాంకైటిస్ ,క్షయ ,శ్వాసనాళాల వాపు , మొదలైన వ్యాదులను నయం చేస్తుంది .ఎన్నో రకాల గుండె జబ్బులను నయం చేస్తుంది .   కామెర్లవ్యాధికి ఉసిరి దివ్యైషధం. ఉసిరి లోని 'లినోయిక్ ఆసిడ్ 'వల్ల కామెర్లుతగ్గుతాయి . కాలేయం లో చేరిన మలినాలు , విషపదార్ధాలు ను తొలగిస్తుంది , 'యాంటి ఆక్షిడెంట్' గా పనిచేస్తుంది .ఉసిరి రసాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో త్రాగడం ఎంతోమంచిది..

ఉసిరి కంటిచూపును మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది. జ్వరం వచ్చి పచ్చెం పెట్టే సమయం లో నూ, బాలింతకూ పచ్చం పెట్టేప్పుడూ పాత చింతకాయ పచ్చడితోపాటుగా ఉసిరి కూడా ఎండు మిర్చితో ,ఇంగు వ వేసి చేసి పెడతారు. రక్త శుధ్ధికి ఇది మంచి మందుగా పని చేస్తుంది.

ఉసిరిసాగు రైతులకు మంచి దిగుబడినిచ్చి వ్యాపారపంటగా ఉపయోగిస్తుంది.ఇది ఎండకలకు, వర్షాభావానికి తట్టుకొని పెరగగలదు. పూర్వం ఉసిరి కాయలను అడవుల్లో నుండి సేకరించే వారు. ఇప్పుడు వాటి వాడకం పెరిగినందున తోటలుగా పెంచుతున్నారు. ఉసిరికాయలు  బాగా ముదిరాక కోసి  ఎండబెట్టి వాటి విత్తనాలను వేరు చేస్తారు. కాయ ముక్కను ఊరగాయలుగానూ, వైద్యాలకూ ఉపయోగిస్తారు. గట్టి పెంకుతో ఉన్న విత్తనాన్ని పగలగొట్టి లోపల చిన్నవిగా ఉన్న ఆరు విత్తనాలను 12 గంటలపాటు నీటిలో నానబెట్టి నీటిలో మునిగిన మంచి విత్తనాలను మాత్రమే తీసుకుని నారుమళ్ళలో విత్తుతారు.

శివ ప్రీతికరమైన కార్తీక సోమవారాల్లో ఉదయాన్నే సూర్యోదయాత్పూర్వం  లేచి స్నానాదికాలు ముగించి, శివుని కి భక్తితో రుద్రాభి షేకం చేసినట్లైతే భక్తులకు సిరిసంపదలు, సుఖసౌఖ్యాలు, ఆరోగ్యం లభిస్తుంది.మొదట్లో చెప్పుకున్నట్లు  ఆదిశంకరులవారు ఆశువుగా చెప్పిన  కనక ధారా స్తవం  మనకు ప్రతిరోజూ చదవ దగ్గ స్తోత్రరాజం.శంకరులు బాల బ్రహ్మ చారిగా ఏడెనిమిదేళ్ళ వయస్సులో భిక్షకోసం ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందు నిల్చి ' మాతా బిక్షం దేహి 'అని  కేకవేయగా ఆపేద బ్రాహ్మణి రెండో వస్త్రం సైతం లేక చీర ఆరేవరకూ ధరించిన చిన్న వస్త్రంతో బయ టకు రాలేక తన ఇంట ఉన్న ఒకేఒక ఎండిన ఉసిరికాయను తన లేమికి చింతి స్తూ ఆబ్రహ్మచారి జోలెలో తన పూరి పాక తలుపు చాటు నుంచీ విసిరివేస్తుంది. శంకరులు ఆమె దారిద్యాన్ని గ్రహించి, అంత లేమిలోనూ తనకున్న ఒకే ఒక ఉసిరికాయను త్యాగ భావంతో తనకు దానం చేసినందుకు సంతసించి ' కనక ధారాస్తవం ' ఆశువుగా చదువుతారు. వెంటనే లక్ష్మి కరుణీంచి ఆమె ఇంట బంగారు ఉసిరి కాయలవాన కురిపిస్తుంది. ఇల్లు నిండిపోతుంది. త్యాగానికి ఋజువు , ఆభావనను గ్రహించి కరుణించిన శంక రులవారి మనస్సూ ఈ కధ ద్వారా మనకు తెలుస్తాయి. అదే కనక ధారా స్తవం 'గా భక్తులు ప్రతిరోజూ చదివి సంపదలు పొందుతారు.

కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి గంధం, అక్షతలు, పుష్పాలతో పూజించాలి. అనంతరం పండితులను పిలిచి సత్కరించి అందరూ భోజనం చేస్తారు.ఈ విధంగా పూర్వం స్నేహితులు బంధువులు కలిసి వేద పండితులను సర్కరించడం ,పూజాదికాలు చేయడం వల్ల పరస్పర స్నేహ భావన, బంధుభావన , రోజువారీ పనినుండీ కాస్తంత సేదతీరడం జరిగేవి. ప్రతి కొమ్మకి అధికసంఖ్యలో ఉసిరి కాయలు కాస్తాయి. వైద్య పరంగా ఉసి రిక ఎన్నో ఔషధగుణా లున్న వృక్షం. ఆయుర్వేదంలోను, యునానీ ఔషధాల్లో విరివిగా వాడతారు.   దీని తో తయారుచేసిన అల్లం మురబ్బా తింటే వాంతులు, విరేచనాలు ,నోటి అరుచి తగ్గి ఎంతో ఉపశమనం చేకూరు తుంది. పొట్ట తేలిగా ఉంటుంది జీర్ణశక్తి పెరుగుతుంది.

దీనితో తయారైన మాత్రలు వాడటం వలన వాత, పిత్త, కఫ రోగాలు దరిచేరవు.  ఉప్పు  లో ఎండ బెట్టినిల్వ చేసు కున్న ఉసిరిముక్కను ప్రతిరోజు ఒక ముక్క బుగ్గన పెట్టు కుని చప్ప రిస్తూవుంటే, జీర్ణశక్తి పెరుగుతుంది. అజీర్తి రోగాన్ని నిర్మూలిస్తుంది, ఎసిడిటీ, అల్సర్ వంటి వ్యాధులు సంక్రమించకుండా కాపాడు తుంది.  చెట్టు అందుబాటులో లేకపోతే ఒక కొమ్మను వెంట తీసుకెళ్లి మరీ వన భోజనం చేస్తుంటారు. ఎందుకంటే కా ర్తీ కం లో శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరూ కూడా ఉసిరి చెట్టు లో కొలువై ఉంటారన్నది విష్ణుపురాణ కథనం. ఉసిరిని భూమాతగానూ కొలుస్తారు. దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృతబిందువులు పొరబాటున భూమ్మీ ద పడ గా  ఉసిరి దానిలోంచీ పుట్టిందని అంటారు. చరక సం హిత ప్రకారం  వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వని ఔషధ మొ క్కల్లో ఉసిరికి ఉసిరే సాటి. 

ఉసిరిని సంస్కృతంలో ఆమ్లాకి లేదా ధాత్రీఫలం అనీ అంటారు.  ఆపిల్ లేక అరటిపండో మరఓ పండులాగానో ఉసిరిని తినలేం . పులుపు కనుక చకచకా నమల్లేం.ఆ పులుపే అది తిన్నవారికి అత్యంత మేలు చేకూరుస్తు న్నది.అనేకానేక రోగాలకు ప్రకృతి ప్రసాదించిన వరమే ఉసిరి. అందుకే దీన్ని సర్వదోషహర అనీ పిలుస్తారు. శీతకాలం నుంచి వేసవివరకూ లభించే ఈ కాయల్ని ఎండబెట్టి నిల్వచేసుకుని ఏడాది పొడవునా వాడవచ్చు.  పంచ దారపాకంలో నిల్వచేసుకుని మురబ్బా రూపంలో  తినవచ్చు.

ఐతే ఉసిరిలో రెండు రకాలున్నాయి. ఒకటి పుల్లని రాచ ఉసిరి. ఇదిగట్టిగా పూర్తిగా పులల్గా ఉంటుంది. నిల్వ పచ్చ ళ్ళకూ మందులకూ , ఔషధ తయారీలకూ ఇది ప్రత్యేకం. మరొకటి చేదూ తీపీ వగరూ ఘాటూ పులుపూ కలగలిసినట్లుండే ఉసిరి. దీన్ని రాచ ఉసిరి అంటారు.దీన్ని  తినడానికో పులిహోరకో , అప్పటికపౌడు చేసుకునే రోటి [ మిక్సీ ] పచ్చడికో మాత్రమే వాడతాం.దీని సులువుగా నవలచ్చు, మెత్తగా ఉంటుంది. పండు కాస్తంత తీపిగానూ అనిపిస్తుంది , పులుపు తక్కువగా ఉండటాన పిల్లలు కోసుకుని తింటుంటారు. ఈ ఉసిరి పొడిని దుస్తుల అద్దకాల్లోనూ ఎక్కువగా వాడతారు.  ఉసిరిలో పండేకాక వేరు నుంచి చిగురు వరకూ ప్రతీదీ ఔషధమే. వందగ్రా. ఉసిరిలో 80 శాతం నీరూ కొద్దిగా ప్రొటీన్లూ, పిండిపదార్థాలూ పీచూ లభిస్తాయి. 478మి.గ్రా. సి-విట మిన్ , ఎంబ్లికానిన్-ఎ, ఎంబ్లికానిన్-బి, ప్యునిగ్లుకానన్ వంటి పాలీఫినాల్సూ, ఎలాజిక్, గాలిక్ ఆమ్లం. వంటి ఫ్లేవ నాయిడ్లూ అధికంగా ఉంటాయి. కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలూ ఉసిరిలో దొరు కు తాయి.ఉసిరిలో రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు అంగీకరించారు.మనదేశంలో పండే ఈ ఉసిరిని పొడి, క్యాండీలు, రసం రూపంలో నిల్వచేసి ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తున్నారు. అందుకే ఉసిరిని  ఆరోగ్యసిరి అంటారు. ఉసిరి కాయ మీద వత్తిని వెలిగించి, క్షీరాబ్ది ద్వాదశినాడు తులసితో పాటుగా ఉసిరిని కూడా పూజించ డంజరుగుతుంటుంది. ఉసిరి నీడ పడుతున్న నీటిలో స్నానం చేయడంకూడా ఆరోగ్య రక్షణ కలిగిస్తుందని నమ్మి క. మన ఆరోగ్యానికీ, పర్యావరణానికి మేలు చేసే వృక్షాలను దేవతా మూర్తులుగా భావించి కొలవడం మన హిందూ దేశ ఆచారాలల్లోని గొప్పదనం.

కార్తీక మాసంలో చలి పెరుగుతుంది. అపుడు  కఫసంబంధమైన, జీర్ణసంబంధమైన వ్యాధులు అనేకం వచ్చే అవ కాశం ఉంటుంది. ఉసిరిని తీసుకోవడం, ఉసిరికి దగ్గరగా ఉండటం వల్ల ఈ దోషాలు కొంతవరకూ తగుతాయి. ఆయుర్వేదం ప్రకారం ఉసిరి చెట్టులోని ప్రతి భాగమూ ఆరోగ్యాన్ని కలిగించేదే! ఉసిరి వేళ్లు బావిలోకి చేరితే ఉప్పునీరు కూడా తియ్యగా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. తులసి, ఉసిరి, వేప చెట్ల నుంచి వచ్చే గాలి చాలా శ్రేష్టమని మన పెద్దల నమ్మిక.బావుల్లో ఉసిరి విత్తనాకు పోస్తారు. దీనివల్ల ఆనీరు శుధ్ధి అవుతుందని పూర్వుల నమ్మిక.

మరిన్ని శీర్షికలు
weekly horoscope 16th september to 22nd september