Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
usiri gurinchi manaku teliyanivenno..

ఈ సంచికలో >> శీర్షికలు >>

16-09-2016 నుండి 22-09-2016 వరకు వారఫలాలు - - శ్రీకాంత్

మేష రాశి :ఈవారం మొత్తంమీద బంధువులను కలుస్తారు, వారితో మీ ఆలోచనలను పంచుకుంటారు. వ్యాపారపరమైన లావాదేవీలను వారితో కలిగి ఉంటె వాటివిషయంలో మరొకసారి చర్చలు చేయుటకు ప్రయత్నం చేయుట మంచిది. కుటుంబ పరమైన విషయాల్లో సంతానం గురుంచి సమయాన్ని కేటయిస్తారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో కొంత మానసికఒత్తిడిని కలిగి ఉంటారు. జీవితభాగస్వామితో ఆర్థికపరమైన చర్చలు రాకూండా జాగ్రత్త పడండి. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులు లభించే అవకాశం కలదు. వాహనముల విషయంలో మాత్రం  జాగ్రత్తలు  తీసుకోవడం సూచన.

 

వృషభ రాశి : ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకునే ప్రయత్నం  చేయుట సూచన. విద్యాపరమైన విషయాల్లో సానుకూలమైన ఫలితాలు వస్తాయి. మిత్రులతో సమయాన్ని గడుపుతారు, అలాగే మీ ఆలోచనలను పంచుకుంటారు. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. సోదరులతో మీ ఆలోచనలను పంచుకుంటారు వారితో కలిసి నూతన పనులను మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. కుటుంబసభ్యులనుండి సహకారం అందుతుంది. 

 

 

మిథున రాశి : ఈవారం మొత్తంమీద చర్చాపరమైన విషయాల్లో పాల్గొనేటప్పుడు సర్దుబాటు విధానం అలాగే మౌనాన్ని వహించుట మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో మీకంటూ ఒక స్పష్టమైన విధానం కలిగి  ఉండుట సూచన. మిత్రులవలన అనుకోని ఇబ్బందులు ఏర్పడుటకు ఆస్కారం కలదు. కుటుంబపరమైన విషయాల్లో కొంత సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆత్మీయుల ఆరోగ్యం మిమ్మల్ని కొంత ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది. జీవితభాగస్వామి నుండి వచ్చు సూచనలను పాటించుట వలన మేలుజరుగుతుంది. మానసికంగా దృడంగా ఉండుట వలన ఉన్నతమైన నిర్ణయాలు తీసుకోవచ్చును.

 


 

కర్కాటక రాశి :  ఈవారం మొత్తంమీద కొన్ని కొన్ని సందర్భాల్లో ఊహించని సంఘటనలు జరుగుట వలన కొంత నిరాశకు లోనయ్యే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ముందుకు వెళ్ళుట మంచిది, నూతన పెట్టుబడులు వద్దు.ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి, అనవసరమైన ప్రయాణాలు (సరద,విహార)వాయిదావేయుట సూచన. ఉద్యోగంలో అధికారుల నుండి వచ్చిన సూచనలకు ప్రాధాన్యం ఇవ్వడం అనేది సూచన. మీ మాటతీరు కొంతమందికి ఇబ్బందిని కలిగించేదిగా ఉండేఅవకాశం ఉంది,సరిచూసుకోండి. విదేశీప్రయత్నాలు ఆలోచన చేయండి.   

 

 

           
సింహ రాశి : ఈవారం మొత్తంమీద మీరు నలుగురికి ఉపయోగ పడే ఆలోచనలు కలిగి ఉంటారు. చేపట్టిన పనులను అత్యుత్సాహముతో కాకుండా ప్రణాళికతో ముందుకు తీసుకువెళ్ళు ప్రయత్నం చేయుట మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది, వాటికిసమయాన్ని ఇస్తారు. కుటుంబంలో పెద్దలతో సమయాన్ని గడుపుటకు ఇష్టపడుతారు. కొన్ని కొన్ని విషయాల్లో మీ ఆలోచనలు అవతలివారికి వ్యతిరేకంగా అర్ధమయ్యే అవకాశం ఉంది, దీనివలన అనుకోని ఇబ్బందులు ఏర్పడుతాయి, జాగ్రత్త. స్త్రీ పరమైన విషయాలకు సమయం, ధనం వెచ్చిస్తారు.  

 

కన్యా రాశి : ఈవారం మొత్తంమీద ఉత్సహాంగాను, ఉల్లాసంగా ఉండి సమయాన్ని మిత్రులతో కలిసి సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. గతంలో చేపట్టిన పనులకు గనుఁ తరిగి మల్లి మల్లి పనిచేసే పరిస్థితి వచ్చే ఆస్కారామ్ ఉంది. చేసిన పనినే మల్లి చేయుట వలన కొంత నిరాశకు లోనవుతారు. వరం చివరలో అనుకోని ఇబ్బందులు, ఆర్థికపరమైన సమస్యలు వస్తాయి. సోదరులతో మీ ఆలోచనలు తెలియజేస్తారు, వారితో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. ఆలోచనలు తగ్గించుకొనే ప్రయత్నం మంచిది.   

 

 

   తులా రాశి : ఈవారం మొత్తంమీద మొదట్లో కొంత వ్యతిరేకత ఉన్న, కొంత సర్దుబాటు విధానం కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. చేపట్టిన పనులను మెల్లగా విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో పెద్దల లేదా అనుభజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ఉద్యోగంలో మీ ఆలోచనలకు ప్రాధాన్యం పెరుగుతుంది.  వివాదాస్పద వాఖ్యలు చేయుట వలన మరింత నస్టపోయే అవకాశం ఉంది కావున ఆలోచనతో ప్రవర్తించుట సూచన. మిత్రులతో సమయాన్ని వ్యర్థం చేసుకొనే అవకాశం ఉంది , జాగ్రత్త. కుటుంబంలో పెద్దల సూచనలు పరిగణలోకి తీసుకోవడం ఉత్తమం.  

 

 

    

వృశ్చిక రాశి  : ఈవారం మొత్తంమీద కుటుంబపరమైన విషయాల్లో ఆలోచనలు అధికం అయ్యే అవకాశం ఉంది, నూతన ప్రయత్నాల విషయంలో స్పష్టత అవసరం. ముఖ్యంగా వ్యాపారపరమైన విషయాల్లో చిన్న చిన్న విషయాలను సైతం పరిగణలోకి తీసుకోవడం సూచన. వాహనముల వలన ఇబ్బందులు ఏర్పడే ఆస్కారం కలదు, కావున తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. మధ్యవర్తిత్వం వహించకపోవడం అనేది ఉత్తమం. సంతానపరమైన విషయాల్లో కొంత ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది,సర్దుబాటు విధానము అలాగే దూరదృష్టి అవసరం. మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. 

 

 

ధనస్సు రాశి  :  ఈవారం మొత్తంమీద ఇష్టమైనవ్యక్తులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది. వాహనముల విషయంలో ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో ఒత్తిడిని పొందుటకు అవకాశం ఉంది. చర్చల్లో పాల్గొనేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి, సూచన. సంతానపరమైన విషయాల్లో పెద్దలనుండి ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. దూరప్రదేశప్రయాణాలు చేయువారు అన్నిరకాల జాగ్రత్తలు తీఉస్కోవడం సూచన.

 

 

 

మకర రాశి  :  ఈవారం మొత్తంమీద నూతన నిర్ణయాలు తీసుకోవడంలో కొంత సందిగ్దత ఉన్న, చివరకు దానిని అధిగమిస్తారు. గతంలో చేపట్టిన పనులకు గాను వారం చివరలో నలుగురిలో గుర్తింపును పొందుతారు. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న మిత్రులనుండి కీలకమైన విషయాలు తెలుస్తాయి. చర్చాపరమైన విషయాల్లో పాలగొనవల్సి వస్తే  స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం ఉత్తమం. వ్యాపారపరమైన విషయాల్లో సొంత ఆలోచనలు చేయకండి. అలాగే నూతన పెట్టుబడుల విషయంలో శ్రద్ద అవసరం. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది.

 

 

కుంభ రాశి : ఈవారం మొత్తంమీద మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. నూతన ఆలోచనలను పెద్దలతో పంచుకుంటారు. ప్రయాణాల్లో నూతన పరిచయాలకు అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో ఒత్తిడిని అధిగమిస్తారు. ఎదో తెలియని ఒక వెలితి మిమ్మల్ని కొంత నిరాశకు లోనుచేసే ఆస్కారం ఉంది, జాగ్రత్త. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది. చర్చల్లో మీ స్వభావాన్ని ప్రదరిస్తారు. బంధువులు కొంత వ్యతిరేకతను మీ పై చూపించే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులకు మీ ఆలోచనలు నచ్చుతాయి, గుర్తింపును పొందుతారు. కొంత నిదానం కూడా అవసరమే.

 

మీన రాశి :  ఈవారం మొత్తంమీద మొదట్లో ఒత్తిడిని పొందుతారు. సరైన ప్రణాళిక కలిగి ఉండి ఆ మేరకు ముందుకు వెళ్ళుట సూచన. చేపట్టిన పనులను కొంత శ్రమమీద పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో ఆశాజనకమైన వాతావరణం రావడం కొంత ఊరట. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. మీ ఆలోచనలను పెద్దలకు స్పష్టంగా తెలియజేయుట సూచన. స్త్రీ పరమైన విషయాల వలన చిన్న చిన్న ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది , జాగ్రత్త. యోగ,ధ్యానం మొదలైన వాటికి సమయాన్ని ఇవ్వడం సూచన. ఇస్టమైన వ్యక్తులను కలుసుకొనే ఆస్కారం కలదు.

మరిన్ని శీర్షికలు
sahiteevanam