Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
me..only me

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఆశ్చర్యము కలిగించే నిమ్మ ఉపయోగాలు మరికొన్ని - ..

lemon speciality
నిమ్మకాయలు మంచి సువాసన, రుచి కలిగిన సిట్రస్ జాతికి చెందిన కాయలు వీటిని ఆహారములోను పానీయాల తయారీ లోనూ విరివిగా ఉపయోగిస్తాము.ఆరోగ్య పరముగా నిమ్మ ఉపయోగాలను ఇంతకూ ముందు తెలుసుకున్నాము దీనికి ఉన్న యాంటీ బ్యాక్ట్ రియల్  గుణాలు విటమిన్ సి అధికముగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగిస్తుంది, ప్రస్తుతము నిమ్మఇంటిలో  ఇంకా ఎన్ని రకాలుగా ఉపయోగిస్తుందో తెలుసుకొనే ప్రయత్నమూ చేద్దాము. నిమ్మ ఇంటికి వంటికి రెండింటికి ఉపయోగము. నిమ్మ ఇతర ఉపయోగాలను తెలుసుకుంటే నిమ్మను నిత్యజీవితములో ఎక్కువగా ఉపయోగించుకొని లాభాలను పొందవచ్చు.

1. ఇంటిలో క్రిమికీటకాలు బెడదను ఎదుర్కోవటానికి ఒక చిన్న పాత్రలో నిమ్మరసాన్నితీసుకొని ఒక ప్రదేశములో ఉంచితే కీటకాలు ఆ దరిదాపులలో ఉండవు. 

2 ఇంటిలో తాజా సువాసనలు కావాలంటే 1:1 నిష్పత్తిలో నిమ్మరసము నీరు తీసుకొని ఈ మిశ్రమాన్ని ఎయిర్ ప్రెషనర్ గా వాడవచ్చు. 

3. బాత్ రూమ్ లోని షవర్ గాని టబ్ గాని పాచి లేదా ఫంగస్ పేరుకున్నప్పుడు నీరు కలిపినా నిమ్మ రసముతో రుద్దిన ఆ పాచీ లేదా బూజు పూర్తిగా సులభముగా తొలగించబడుతుంది . 

4.వెనిగర్ తో నిమ్మరసాన్ని కలిపిన వెనిగర్ యొక్క ఘాటైన వాసం తగ్గి వెనిగర్ యొక్క డిస్ ఇంఫెక్టన్ట్ (క్రిమి సంహారిణి )లక్షణాలు అధికమవుతాయి . 

5. ఒక గిన్నెలో నీరు నిమ్మ చెట్టు కాడలను (పచ్చివి) తీసుకొని మైక్రో వేవ్ లో ఒక నిముషము పాటు ఉంచి ఆ తరువాత మైక్రో వేవ్ లోపల శుబ్రపరిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి అంటే అంతకు ముందు పోనీ మొండి మరకలు కూడా పోతాయి ఏమైనా ఇతర వాసనలు ఉంటె అవికూడా పోతాయి. 

6. ఫ్రిజ్ లో ఒక నిమ్మకాయను తరిగి ఒక ముక్కను ఉంచితే ఫ్రిజ్ లోని చేదు వాసనలు ఏమైనా ఉంటె పోతాయి 

7. నిమ్మ రసాన్నిత్రాగే సోడాతో కలిపి, పరిశుభ్రమైన  టవల్  ను ఆ ద్రావణములో ముంచి క్రోమ్ ,ఇత్తడి, రాగి వస్తువులను తుడిచి మంచి నీటితో కడిగి పొడిగుడ్డతో లేదా పాత న్యూస్ పేపర్ తో తుడిస్తే ఆ వస్తువులు తళ తళ మెరుస్తుంటాయి . 

8. ఒక అర కప్పు బొరాక్స్ పౌడర్ ను ఒక గ్లాసు  నిమ్మరసముతో కలిపి బాత్ రూమ్ లోని టాయిలెట్లను శుభ్రముచేస్తే  అవి చక్కగా కొత్తవిగా ను పరిశుబ్రముగాను కనిపిస్తాయి . 

9. సింకులు, సింకులనుండి నీళ్లు పోయే గొట్టాలలో నీరు సరిగా పోనప్పుడు నిమ్మకాయ చెక్కను ఉపయోగించి  నీటితో బాగా కడిగితే ఆ సమస్య తీరుతుంది . 

10. ప్రస్తుతము వాషింగ్ సోప్ లు డిటర్జన్ట్  లు నిమ్మ కలిగినవి, లేదా నిమ్మ వాసనతో అని ప్రచారము చేయటాన్నీ చూస్తున్నాము ఒక చెంచాడు నిమ్మ రసము వాషింగ్ మెషీన్లో బట్టలు ఉతికేటప్పుడు డిటర్ జంట్ తో కలిపితే బట్టలు  మంచి సువాసనతో ఉంటాయి వాషింగ్ మెషీన్లో బట్టలు ఉతికినాక ఆ బట్టలను ఒక కప్పు నిమ్మ రసము కలిపినా నీటిలో జాడించి  అరేస్తే తెల్లగా ఉంటాయి. 

11. పాత్రలపై గల జిడ్డు మొండి మరకలను పోగొట్టటానికి  డిష్ సోప్ కు ఒక చెంచాడు నిమ్మరసము కలిపితే మంచి ఫలితము ఉంటుంది అందుకే డిష్ సోప్ లు నిమ్మ కలిగిన అని ప్రచారము చేస్తాయి . 

12. డ్రైనేజ్ గొట్టాలలో ఏదైనా మలినాలు ఇరుక్కొని నీళ్ళు పోకపోతే వేడి నిమ్మరసాన్ని త్రాగే సోడాలో కలిపి  గొట్టాలో పోస్తే అడ్డము పడ్డ చెత్త పోతుంది 

13.ఇళ్లలో చెత్తడబ్బాలలొ చెత్త వల్ల ఒక్కొక్కసారి చెడువాసన వస్తుంది అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఆ చెత్త డబ్బాలో నిమ్మకాయ తొక్కలను వేసి ఉంచాలి ఆ తొక్కలు చెడు వాసనలను గ్ర హిస్తాయి . 

14. కూరగాయలను తరగటానికి వాడే కట్టింగ్ బోర్డును వాడినాక అలాగే వదిలి వేయటం వల్ల ఆ బోర్డు పైన సూక్ష్మజీవులు చేరతాయి వాటిని చంపటానికి నిమ్మ చెక్కతో ఆ బోర్డు పైన రుద్దితే సరిపోతుంది అంతేకాకుండా చేదు వాసనలు ఉంటె పోతాయి. 

15. నాలుగు చెంచాల నిమ్మరసాన్ని రెండు లీటర్ల నీటిలో కలిపి కిటికీలకు ఉండే అద్దాలను లేదా గ్లాసు వస్తువుల పై భాగాలను తుడిస్తే చాలా పరిశుబ్రముగా ఉంటాయి. 

16.ఇంటిలోని ఫర్నీచరును ఒకభాగము నిమ్మరసానికి రెండు భాగాలు ఆలివ్ నూనె లేదా ఏదైనా వంటనూనె కలిపి తుడిస్తే మంచి పాలిష్ పెట్టినట్లు మెరుస్తూ ఉంటాయి. 

17. నిమ్మ రసాన్నివెంట్రుకలకు పట్టించి ఒక గంట సేపు ఉదయపు ఎండలో ఉంటె జుట్టు నల్లగా నిగనిగ లాడుతూ ఉంటుంది,

18. నిమ్మరసాన్ని ఒక గ్లాసు వేడినీటితో కలిపి మాడుకు పట్టించి జుట్టు ఆ నీటితో నానేటట్లు కొన్ని నిముషాలపాటు ఉంచి తరువాత నీతితో కడిగివేయాలి. కానీ సున్నితమైన మాడు ఉన్నవాళ్లు ఈ ప్రయోగము చేయరాదు ఈ విధముగా చేయటము వల్ల జుట్టు మృదువుగా ఉంటుంది 

19. ఏదైనా గాయాలు గాట్లు పడ్డప్పుడు వాటిపై  కొద్దిగా నిమ్మరసాన్ని పోసినప్పుడు గాయాలు లేదా కత్తిగాట్లనుండి వచ్చే రక్తస్రావము ఆగుతుంది క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది అంతేకాకుండా  కుట్టినప్పుడు చర్మము పైన ఏర్పడే దురద లాంటివి తగ్గుతాయి. 

20. చేపలు ఉల్లిపాయలు వంటివి వండేటప్పుడు వాటి వాసన చేతులకు అంటి త్వరగా పోదు అటువంటప్పుడు నిమ్మరసముతో చేతులను శుబ్రము చేసుకుంటే ఆ వాసనలు పోతాయి 

ఇవండీ నిమ్మ వల్ల మన ఇంట్లో ఒనగూడే ఉపయోగాలు కొన్ని నేను తెలుసుకున్నవి మీరు కూడా మీ ఇంటిలో ఈ చిట్కాలను ఉపయోగించి చూడండి నిమ్మ దొరకనిది కాదు ఖరీదైనది కాదు అందువల్ల ప్రయత్నించి చూస్తే నష్టము ఏమి లేదు.  

- అంబడిపూడి శ్యాం సుందర రావు
మరిన్ని శీర్షికలు
different villages