Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope 23rd september to 29th september

ఈ సంచికలో >> శీర్షికలు >>

బోలెడు ఉపయోగాల నేరేడు.. - .

indian black flum

గజాననం భూతగణాది సేవితం కపిత్థం జంబూఫల చారు భక్షణం --అంటూ గణనాధునికి మిగతా పళ్ళ తోపాటుగా  నేరేళ్ళు నివేదన చేస్తాం. నేరేడు చెట్టుకు భారతీయ సంస్కృతిలో ప్రముఖ స్థానం ఉంది. ఘనచరిత కూడా ఉంది. నేరేడు పళ్ళను ఇండియన్ బ్లాక్ ప్లం అంటారు.  నేరేడు చెట్టుగురించీ చెప్పు కుంటే చాలానే ఉంది.  నేరేడు చెట్టు పళ్ళే కాక వివిధభాగాల వల్ల , కాండపు బెరడుతో సహా ఆయు ర్వేద  ఔషధాల తయారీకి వాడుతున్నారు.

జంబూ ఫలం - అని నేరేడును  సంస్కృతంలో అంటారు. వేదాలలో భారతదేశానికి జంబూ ద్వీపము అనే పేరు ఉంది.హిందువులు  ప్రార్థనాసమయంలో పూజ ప్రారంభంలో సంకల్పఃలో మన ప్రవర చెప్పుకుంటూ  శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభన ముహూర్తే అద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవ శ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణలేక ఉత్తర దిగ్భాగే  శ్రీశైలశ్చ ఉత్తర భాగే, కృష్ణా గోదావారీ మధ్య ప్రదేసే , శోభన గృహే లేక స్వగృహే , సమస్త దేవతా ప్రీత్యర్ధం  బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమా నేన,--- అం టూ  మనం నివసించే ప్రాంతాన్నీ గోత్ర నామా లనూ చెప్పుకుం టూ మొదలెడతాం.జంబూ అంటే "నేరేడు" పండు లేదా "గిన్నె కాయ", మన దేశంలో ఎక్కువగా నేరేడు పండ్లు ఉండటాన  దీనికి ఈ పేరు వచ్చిన దని  పరిశోధకులు అంటున్నారు. మన దేశం జంబూనది మధ్యలో ఉండేదనీ అందుకే మన భూ భాగాన్ని పూర్వీకులు జంబూద్వీపం అన్నారనీ, జంబూనది నేరేడు చెట్ల మధ్యగా ప్రవహించడం వల్ల ఆ నీరు తియ్యగా, మధురంగా ఉండేదనీకూడా చెప్తారు. 

ఋతు  పవన ప్రాంతల్లో ఈ నేరేడు చెట్లూ పెరుగుతాయి. ఇది సతత హరిత తరువు. ఇది ఆరోగ్య సంవ ర్ధని.  నేరేడు పండుకు పండగల రోజుల్లో అధిక ప్రాధాన్యత ఉంది.

నేరేడు పండును ఏడాదికొకసారైనా తినాలనంటారు. పొరపాటున మన పొట్టలోకితలవెంట్రుకలు వెళితే ఈ పండుతింటే అవి విసర్జనద్వారా బయటికొచ్చేస్తాయని పెద్దలు అంటారు.నేరేడుపండు తనరంగుతో శ్రీ కృష్ణునికి దగ్గరవుతున్నది.

నేరేడును ఆంగ్లంలో జావా ప్లమ్, బ్లాక్ ప్లమ్, జాంబుల్, ఇండియన్ బ్లాక్‌బెర్రీ అని పిలుస్తారు. తమిళంలో జంబు, నాగపళమ్‌ అనీ , మలయాళంలో నవల్‌ఫలం అని ,కన్నడం లో నేరలె హణ్ణినగిడ, నేరలెతోపు అనీ, రోజ్ యాలిల్ అనీ అంటారు.

నేరేడు బెరడుతో గుండ్రంగా ఒక చక్రంలా అంటే బవిలో దించే వరలా తయారుచేసి,బావి తవ్వేటప్పడు కింద ముందుగా ఈ చక్రం వేసి ఆ పైన మిగిలిన ఒరలు వేయడంవల్ల,నేరేడు బెరడు నీటిని శుభ్రం చేసి  తియ్యగా చేస్తుంది.నీళ్లలోని మలినాలను పోగొడుతుంది. నీళల్లో ఉండే వగరు, చేదు పోయి తియ్యగా నీళ్లు మారతాయి.

జంబుకేశ్వరంలో పరమశివుడిని జంబుకేశ్వరుడు అని పిలుస్తారు. ఇది కంచి దగ్గర ఉన్న శివక్షేత్రం. ఇక్కడి శివుడు నేరేడు చెట్టు మొదట్లో వెలిశాడు. జంబూనది ఈశ్వరాకారంగా ఉన్నట్లు చెబుతారు. ధూర్జటి కాళహస్తీశ్వర మహత్యంలో ‘నేరేటి పండ్లును నెలయూటి పండ్లను’ అని వర్ణించాడు. కన్నప్ప ఈ పండ్లను నిత్యం శివుడికి నైవేద్యంగా పెట్టాడనిధూర్జటిమహాకవి  చెపాడు . అలాగే జంబూఫలాన్ని నీలి వర్ణం ఆధారంగా నారాయణస్వామిగా లేదా వెంక టేశ్వరునిగా వర్ణిస్తారు. పండు ఆకారాన్ని బట్టి అది లింగాకారంలో ఉండటంతో ధూర్జటి శివస్వరూపంగా కొలిచాడు. మామిడి తోరణాలు దొరకని చోట నేరేడు తోరణాలు కడతారు.

[-21 జూన్, 2015 సాక్షి దినపత్రిక ఆధారంగా ]

నేరేడును తింటే చక్కెరవ్యాధి దగ్గరకు రాదు.నీలం రంగులో ఉండే ఈ పండు రుచి కొద్దిగా వగరుగా ఉంటుంది.గుజ్జు మెత్తగా ఉంటుంది. నేరేడు చెట్టు బహుళ ప్రయోజనకారి. ఈ కలపతో రైల్వే స్లీపర్లు, పొలాల్లో మోటారు పంపు సెట్లకు ఆధారముగా కొయ్యను వాదుతారు.ప్యాకేజీ పెట్టెలు వగైరా వస్తు తయారీకీ వాడుతారు.- కలపతో తలుపులు, కిటికీలు, కుర్చీలు, బల్లలు, ఇతర ఇంటి సామానులు చేయడావిని ఉపయోగిస్తారు. నేరేడు పండు. నేరేడు చెట్టు 100 సంవత్సరాలు ఉండే  మహా వృక్షం.  శ్రీకృష్ణప్రభువు శరీర ఛాయకు దగ్గరగా ఉండటాన  గుజరాత్ మొదలైన రాష్ట్రాల్లో జంబూ వృక్షాన్ని పవిత్ర మైన వృక్షంగా భావించి గౌరవి స్తా రు.  ఆఫ్రికా దేశాలల్లో దీన్ని సంస్కృత పదమైన "జంబూ" అనే మాట కు దగ్గరగా "జంబులా ట్రీ" గా పిలుస్తారు.పోర్చుగీసులు మనదేశానికి వ్యాపారనిమిత్తం వచ్చి నపుడు  ప్రకృతి దినుసులను కూడా వారితో విదే శాలకు తీసుకుపోయారు. వాళ్ళు  బ్రెజిల్ దేశానికి  ఈ నేరేడు విత్తనాలు తీసు కెళ్ళారుట. అలా జంబూబీజాలను అక్కడ నాటారుట. బ్రెజిల్ ల్లో  పక్షులు ఈ పండ్లను ఇష్టంగా తిని, వాటి విసర్జన ద్వారా విత్తనాలు  అక్కడ చాలా వేగంగా వ్యాపించాయిట.ఈ చెట్టు చాలా వేగంగా పెరిగే స్వభావం వల్ల త్వరగా వ్యాపించడం జరిగింది.బ్రెజిల్ వాతావరణం  అను కూలంగా ఉండటాన  నేరేళ్ళూ అక్కడ విపరీ తంగా పెరిగాయిట. అలా బ్రెజిల్ దేశప్రజలు ' జంబులా ట్రీ ' అని పిలిస్తూ ఈ నేరేడు పండ్లనుతినేవారుట.  ఇలా జంబూ ఫలము, జంబూ చెట్టు విదే శా ల కువ్యాపించింది.మన దేశాలలో కన్నా, పశ్చిమ ఖండాలలో ఈ పళ్ళ రసాలను, రంగుల తయారీకీ, హెల్త్ డ్రింక్స్ లోకీ, అదనపు రుచినీ కలుగ జేసేందుకై వాడుతున్నారు.
నేరేడు చెట్టు ఒక పెద్ద వృక్షం. ఇది పూర్వం అడవుల్లో మాత్రమే ఉండేది. నేడు రోడ్ల ప్రక్కన కూడా పెంచ బడుతున్నాయి. నేరేడు వృక్షాలను వ్యాపారరీత్యాకూడా పెంచడం జరుగు తున్నది.వీటిని పండ్లు కోసం పెంచుతారు. నేరేడు శాస్త్రీయ నామం 'షైజీజియం క్యుమిని'. నేరేడు చెట్లు వంద ఏళ్ళకు పైగా జీవిస్తా యి. సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లలో నేరేడు ప్రధానమైనదిగా చెప్పబడు తు న్న ది. నోట్లో పడగానే మెత్తగా, కమ్మగా ఉండే దీనిరుచి అందరు ఇష్టంగా తినేందుకు దోహద పడుతు న్నది.ఈ పండు పోషకాల గని. నేరేడు పండ్లలో , గుండ్రంగా పెద్దగ వుండే ఒక రకం., కోలగా వుండి పెద్దగా వుండే  అల్ల నేరేడు , గుండ్రంగా వుండి చిన్నవిగా వుండే  చిట్టి నేరేడు అని మూడు రకాలు భిస్తు న్నాయి.

అనారోగ్యాల నివారణి. నేరేడు శక్తి నిస్తూ   ఆరోగ్యానికి మేలు చేయడమే కాకకొన్నిరకాల రోగాలనూ నియంత్రించే శక్తి కలిగి ఉంది. పండే కాక ఆకులు,బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆక్సాలిక్ టాన్మిక్ ఆమ్లం, విటమిన్లు, క్రోమియం వంటివి నేరేడులో పుష్కలంగా లభిస్తాయి.రామాయణం లో శ్రీరామచంద్రుడు పద్నాలుగేళ్ళు వనవాసదీక్షలో  ఆరోగ్యప్రదాతలైన , రుచికరమైన  ఈ పండ్లనే భుజించినత్లూ చెప్తారు.  భారతదేశంలోని గుజరాత్ మాత్రమేకాక ఇంకాపలు ప్రాంతాల్లో దీన్ని దేవతా ఫలంగా భావిస్తారు.శ్రీకృష్ణునికి నేరేడు పండ్ల నివేదన తప్పనిసరిగా కృష్ణ జయతిరోజున అర్పించు కుంటారు.

కాలేయం పనితీరు క్రమబద్ధీకరించడానికి ,శుభ్రపరచడానికి నేరేడు దివ్యౌషధంలా పనిచేస్తుంది.ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి. జ్వరంగా ఉన్నపుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే శరీర తాపం తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునే వారు,మధుమేహ రోగగ్రస్తులు  వీటిని రోజూ కొన్ని తినవచ్చు.

ఒక్క పండే కాక నేరేడు చెట్టు ఆకులు, బెరడు, గింజలు కూడా ఎంతో మేలుచేస్తాయి. నేరేడు ఆకులతో చేసే కషాయం.బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. ఆకుల్ని దంచి కషాయంగా కాచి పుక్కిలిస్తే దంతాలు కదలడం, చిగుళ్ల వాపులు, పుండ్లు వంటివి త్వరగా తగ్గుతాయి. ఆకులను నమిలి నీళ్లతో పుక్కిలించి ఉమ్మి వేస్తుంటే.. నోటి దుర్వాసన తగ్గుతుంది. ఆకు రసంలో పసుపు కలిపి పురుగులు కుట్టినచోట, దురదలు, సాధారణ దద్దుర్లకు లేపనంగా రాస్తుంటే ఉపశమనం లభిస్తుంది. నేరేడు అరగడానికి ఎక్కు వ సమయం పడుతుంది కాబట్టి ఉప్పు కలిపిన మజ్జిగలో కొంతసమయం ఉంచి తినాలి. భోజనమైన గంట తరువాత ఈ పండ్లు తీసుకుంటే ఆహారం జీర్ణమవు తుంది.  
నేరేడు పండ్లలో అధికంగా సోడియ, పొటాషియం, క్యాల్షియం, ఫాస్ఫరస్, మంగనీస్, జింక్, ఇరన్, విట మిన్, సీ, ఎ రైబోప్లెవిన్, నికోటిన్ ఆమ్లం, కొలైన్, ఫోలిక్, మాలిక్ యాసిడ్లు తగిన లభిస్తాయి. దాని లో ని ఇనుము శరీరంలో ఎర్ర రక్తకణాలను వృద్ధి చేస్తుంది. అనీమియా అంటే రక్తహీనతను తగ్గిస్తాయి. కాల్షియం, ఇనుము, పొటాషియం, విటమిన్- సి పుష్కలంగా ఉండే నేరేడు వ్యాధి నిరోధకశక్తిని పెంచడ మే కాక ఎముకలకు పుష్టిని ఇస్తుంది.నేరేడు పండుకు గుండెవ్యాధులను నివారించే శక్తి ఉంది.

నేరేడు పండ్లలో గ్లైకమిక్ ఇండెక్స్ అధికంగా ఉన్నందున మధుమేహవ్యాధిని నియంత్రిస్తుంది. గింజల్ని ఎండబెట్టి పొడిగా చేసుకొని నీటిలో కలుపుకొని తాగితే శరీరంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి.

నేరేడు రసాన్ని, నిమ్మరసంతో కలిపి తీసుకొంటే మైగ్రేన్కు పరిష్కారం లభిస్తుంది. నేరేడు పళ్లను తీసుకొనే వారిలో పళ్లు, చిగుళ్లు బలంగా ఉంటాయి.

పోషక విలువలు. 100 గ్రాముల్లో తడి అంటే నీరు 83.7గ్రా, పిండి పదార్థం-19 గ్రా, మాంసకృత్తులు- 1.3గ్రా, కొవ్వు- 0.1గ్రా, ఖనిజాలు- 0.4గ్రా, పీచుపదార్థం-0.9గ్రా, క్యాల్షియం- 15-30మి.గ్రా, ఇనుము-0.4మి.గ్రా-1మి.గ్రా, సల్ఫర్- 13మి.గ్రా, విటమిన్ సి-18మి.గ్రా.  
నేరేడు,బెరడు,విత్తనాలనూ ఆయుర్వేదం, సిధ్ధ, యునానీ, హెర్బో,మినరల్ మెడిసెన్స్ లో విరివిగా ఉపయోగిస్తున్నారు.

-హైమా శ్రీనివాస్  

మరిన్ని శీర్షికలు
navvunaaluguyugaalu