Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview with  anu emmanuel

ఈ సంచికలో >> సినిమా >>

'కాటమరాయుడు' రెడీ అయ్యాడు

katamarayudu is ready

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'కాటమరాయుడు' సినిమా సెట్స్‌ మీదికెళ్లింది. పవన్‌ కళ్యాణ్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. కంటిన్యూస్‌గా షూటింగ్‌ జరపనున్నారు. కిషోర్‌ కుమార్‌ పార్ధసాని(డాలీ) దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. శరత్‌ మరార్‌ నిర్మాత. హైదరాబాద్‌లో బిజీగా షూటింగ్‌ జరుపుకుంటోంది ఈ చిత్రం. తనకు అత్యంత సన్నిహితుడైన కమెడియన్‌ ఆలీకి, పవన్‌ కళ్యాణ్‌కీ మధ్య కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ముద్దుగుమ్మ శృతిహాసన్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

రెండో సారి శృతిహాసన్‌ ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌తో జతకడుతోంది. ఈ సినిమాలో ఒక కొత్త గెటప్‌లో కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతవరకూ ఏ సినిమాలోనూ కనిపించని న్యూలుక్‌ అట అది. ఫ్యాక్షన్‌ ప్రేమకథా నేపధ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. విజయదశమి సందర్బంగా పవన్‌ లుక్‌తో కూడిన కొత్త లుక్‌ని విడుదల చేస్తారని సమాచారమ్‌. 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' సినిమా ఆశించిన ఫలితాన్నివ్వకపోవడంతో ఈ సినిమాపై పవన్‌ ఫ్యాన్స్‌ ఎక్కువ ఆశక్తి కనబరుస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో పవన్‌ గెటప్‌పై కూడా అందరూ ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. అతి తొందరగా ఈ సినిమా షూటింగ్‌ని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే యోచనలో ఉంది చిత్ర బృందం. 

మరిన్ని సినిమా కబుర్లు
karthee kashmora comming soon