Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
katamarayudu is ready

ఈ సంచికలో >> సినిమా >>

కార్తీ 'కాష్మోరా' వచ్చేస్తోంది

karthee kashmora comming soon

విభిన్న చిత్రాలు చేస్తూ నటుడిగా ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు పైకెక్కుతున్న విలక్షణ నటుడు, యంగ్‌ హీరో కార్తీ తమిళంతోపాటు, తెలు ప్రేక్షకుల్నీ విశేషంగా అలరిస్తున్నాడు. ఈ యంగ్‌ హీరో నటిస్తున్న 'కాష్మోరా' సినిమా ఆడియో విడుదల వేడుక అక్టోబర్‌ 7న జరుగుతుంది. అదే రోజు సినిమా ట్రైలర్‌ని విడుదల చేస్తారు. కార్తీ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. విభిన్నమైన గెటప్‌తో ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ ద్వారా సినీ పరిశ్రమను షాక్‌కి గురిచేశాడు కార్తీ. మమూలుగా కాష్మోరా అంటే దయ్యాలే గుర్తుకొస్తాయి.

కానీ హాలీవుడ్‌ యాక్షన్‌ సినిమాని తలపించే గెటప్‌లో ఉన్నాడు కార్తీ, 'కాష్మోరా' సినిమాలో. కథేంటన్నది సస్పెన్స్‌ అట. గుండుతో, వెరైటీ గడ్డంతో కార్తీ 'కాష్మోరా' సినిమాలో అలరించనున్నాడు. గోకుల్‌ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో నయనతార, శ్రీదివ్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగులో 'ఊపిరి' సినిమా తర్వాత వస్తోన్న కార్తీ సినిమా ఇది. 'ఊపిరి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు కార్తీ. డిఫరెంట్‌ గెటప్‌లో కనిపిస్తోన్న ఈ సినిమా కోసం తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. దీపావళికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 

మరిన్ని సినిమా కబుర్లు
kajal with jeeva