Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
karthee kashmora comming soon

ఈ సంచికలో >> సినిమా >>

కాజల్‌, జీవా 'ఎంతవరకు ఈ ప్రేమ'

kajal with jeeva

'రంగం', స్నేహితుడు' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు యంగ్‌ హీరో జీవా. ఈ యంగ్‌ అండ్‌ రొమాంటిక్‌ హీరో జీవా, ముద్దుగుమ్మ కాజల్‌ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'కవలై వేండాం'. తెలుగులో 'ఎంతవరకూ ఈ ప్రేమ' పేరుతో విడుదల చేస్తున్నారు. డీకే దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. 'యామిరుక్క బయమేన్‌' సినిమాతో విజయం అందుకున్నాడు ఈ డైరెక్టర్‌ డీకే. తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ అయిన కాజల్‌ ఈ సినిమాలో నటిస్తున్న కారణంగా తెలుగులో కూడా మంచి మార్కెట్‌ జరుగుతోంది. అంతేకాదు రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కాజల్‌ పాత్ర డిఫరెంట్‌గా ఉండబోతోందట కూడా. తన పాత్రకి చాలా ప్రాధాన్యత ఉండబోతోందట. అందుకే తెలుగులో ఈ సినిమాను విడుదల చేసే హక్కుల కోసం పోటీ కొనసాగుతోంది.

ఇప్పటికే చాలా బిజినెస్‌ అయ్యింది తెలుగులో ఈ సినిమాకి. ఈ సినిమాలో జీవా, కాజల్‌ మధ్య వచ్చే రొమాంటిక్‌ ససీన్స్‌ అదరహో అన్పించేంతలా ఉంటాయట. కాజల్‌ అందచందాలు, జీవా రొమాంటిక్‌ లుక్స్‌తో ఈ సినిమా యూత్‌నీ, ఆధ్యంతం సాగే వినోదంతో ఫ్యామిలీ ఆడియన్స్‌నీ ఆకట్టుకునేలా ఉండబోతోందట. టోటల్‌గా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు ఈ క్రేజీ జంట అతి త్వరలోనే మన ముందుకు రాబోతోంది. కాజల్‌ ప్రస్తుతం తెలుగులో చిరంజీవితో 'ఖైదీ నెం 150'లో నటిస్తోంది. 
 

మరిన్ని సినిమా కబుర్లు
bunny act tamil industry