Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kajal with jeeva

ఈ సంచికలో >> సినిమా >>

లింగుస్వామితో బన్నీ తమిళ సినిమా

bunny act tamil industry

టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తమిళ సినిమాల్లో సత్తా చాటబోతున్నాడు. తమిళ దర్శకుడు లింగుస్వామితో సినిమాకి కమిట్‌ అయ్యాడు. ఇదే అల్లు అర్జున్‌కి తొలి తమిళ సినిమా. ద్విభాషా చిత్రంగా రూపొందనున్నప్పటికీ, దీన్ని మలయాళంలో కూడా విడుదల చేస్తారు గనుక త్రిభాషా చిత్రం అనవచ్చు. మలయాళంలో అల్లు అర్జున్‌కి మంచి ఫాలోయింగ్‌ ఉంది. మలయాళ మార్కెట్‌లో అల్లు అర్జున్‌ సినిమాలకి మంచి ఓపెనింగ్స్‌తోపాటు, మంచి మార్కెట్‌ కూడా ఉందన్నది అందరికీ తెలుసు కదా. తమిళ మార్కెట్‌పైనా ఇప్పుడు కన్నేసినట్టున్నాడు.

అల్లు అర్జున్‌కి తమిళంలోనూ దూసుకుపోయే టాలెంట్‌ ఉందన్నది నిస్సందేహం. అల్లు అర్జున్‌ డాన్సులకీ, యాక్టింగ్‌కీ ఇప్పటికే తమిళ్‌ ప్రేక్షకుల ఆదరణ ఎంతగానో ఉంది. ఇక డైరెక్ట్‌ తమిళ్‌ సినిమా అంటే ఇక అక్కడ పండగే కదా. అంతేకాదు లింగుస్వామికి తమిళంలో దర్శకుడిగా చాలా మంచి పేరుంది. స్టోరీలో బలం ఉన్న సినిమా అట ఇది. అసలే స్టైలిష్‌ స్టార్‌, అందులోనూ స్టైలిష్‌ ప్రొడ్యూసర్‌ జ్ఞాన్‌వేల్‌ రాజా నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. తొలి చిత్రంతోనే అందులోనూ తమిళంలో ఇంత హవా క్రియేట్‌ చేస్తున్న క్రెడిట్‌ అల్లు అర్జున్‌కే దక్కిందని చెప్పొచ్చు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్‌ చేసే అవకాశం ఉంది. త్వరలోనే వారి పేర్లు వెల్లడి చేయనున్నారు. 

మరిన్ని సినిమా కబుర్లు
chennai moon rashikhanna