ఇద్దరి లుక్స్‌లోనూ ఒకటే ఎక్స్‌ప్రెషన్. ఏదో సాధించాలన్నట్లుగా, ఏంటది? ఇద్దరికీ సేమ్ ఎఫెక్ట్ లుక్. పక్షులు ఎగురుతూ కనిపిస్తున్నాయి. అసలేంటి? ఈ పక్షులు ఎగరడం సంగతేంటి? ఇదంతా ఎందుకనుకుంటున్నారా? నితిన్ హీరోగా తెరకెక్కుతోన్న 'లై' సినిమా ఫస్ట్‌లుక్ గోలే ఇదంతా. ఈ సినిమాకి సంబంధించి గతంలోనే ఓ లుక్ విడుదలైంది. గెడ్డంతో నితిన్ చాలా స్టైలిష్ లుక్‌లో చేతిలో ఓ సూట్‌కేస్ పట్టుకుని నడుస్తూ కనిపించాడు ఆ లుక్‌లో. సైడ్ యాంగిల్‌లో ఉంది ఆ లుక్. ఇప్పుడు తాజాగా మరో లుక్ విడుదలైంది. ఈ లుక్‌లో నితిన్ ఫేస్ ఎక్స్‌ప్రెషన్ అతని ముఖం సగం నుండి పక్షుల గుంపు ఎగురుతూ బయటికి వస్తున్నట్లుగా కనిపిస్తోంది.
దీనర్ధం ఏంటో కానీ, సేమ్ లుక్‌లో సీనియర్ నటుడు ఆర్జున్ కూడా కన్పిస్తున్నాడు. అంతేకాదు ఆయన వీపుపై ఇలాంటి అర్ధంలోనే ఓ టాటూ వేసి ఉంది. ఒక ముఖం, పక్షుల గుంపు.. ఏంటి దీనర్ధం. అర్జున్ కీలక పాత్రలో నటిస్తున్నాడు ఈ సినిమాలో. మేఘా ఆకాష్ హీరోయిన్‌గా నటిస్తోంది. లవ్, ఇంటెలిజెన్స్, ఎనిమి ఈ మూడింటి కలయికలో సినిమా రూపొందుతోంది. యాక్షన్ సీక్వెన్స్‌ని చాలా సింపుల్‌గా హై రేంజ్‌లో తెరకెక్కించడంలో హను రాఘవపూడి దిట్ట. యాక్షన్ థ్రిల్లర్‌గా 'లై' తెరకెక్కుతోంది. ముఖ్యంగా చాక్లెట్ బోయ్‌లా కనిపించే నితిన్ ఈ సినిమాలో పాత బస్తీ కుర్రోడిలా, డిఫరెంట్ గెటప్‌లో కనిపిస్తున్నాడు. ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌తోనే సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు డైరెక్టర్ హను రాఘవపూడి. గతేడాది 'అ,ఆ..'తో సక్సెస్ అందుకున్న నితిన్, ఈ సినిమాతో ఆ సక్సెస్‌ని కంటిన్యూ చేస్తాడేమో చూద్దాం!
|