Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
dasari biopic

ఈ సంచికలో >> సినిమా >>

వర్మ - ఎన్టీఆర్‌ బయోపిక్‌ వచ్చేస్తోంది

varma  and NTR biopic  comming soon

కాంట్రవర్సీలకే కాంట్రవర్సీలా స్వర్గీయ ఎన్టీఆర్‌ జీవిత గాథని తెరకెక్కిస్తానంటూ సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వర్మ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు. వర్మ నుండి అనౌన్స్‌మెంట్‌ వచ్చిన్పటి నుండీ కాంట్రవర్సీ స్టార్ట్‌ అయిపోయింది. ఎన్టీఆర్‌ చరిత్ర చాలా మందికి తెలిసిందే. సినీరంగంలో ఆయన సాధించిన అభివృద్ధి, సంపాదించిన పేరు ప్రఖ్యాతలు అన్నీ ఇన్నీ కావు. అలాగే రాజకీయ రంగంలోనూ ఎన్టీఆర్‌ది సరికొత్త శకం. సినీ, రాజకీయ ప్రముఖునిగా ఆయన చరిత్ర అంతులేనిది. అలాంటి గొప్ప వ్యక్తి జీవితంలోనూ చాలా ఆటు పోట్లే ఉన్నాయి. వెలుగులోకి రాని నిజాలు అనేకం ఉన్నాయి ఆయన జీవితంలో. రామ్‌ గోపాల్‌ వర్మ ఆయనపై ఓ ఫీలర్‌ని విడుదల చేసి అందరిలోనూ ఆశక్తి క్రియేట్‌ చేశాడు. ఆయన వర్మ కదా. ఆయన ఏం చేసినా ఉత్కంఠ అలానే ఉంటుంది.

అంతేకాదు, స్వయంగా ఆయన వాయిస్‌ ఓవర్‌లో రిలీజ్‌ అయిన ఈ పీలర్‌లో కాంట్రవర్సీలకే కాంట్రవర్సీ.. అంటూ ఆయన సెలవివ్వడం మరో విశేషం. ఇవన్నీ వెరసి, ఈ బయోపిక్‌పై సర్వత్రా ఆశక్తి నెలకొంది. వర్మ దేనికీ భయపడరు. ఆయన ఏం చేయాలనుకుంటే అదే చేస్తారు. పర్‌ఫక్ట్‌గా చేసి చూపిస్తారు. దటీజ్‌ వర్మ అంతే. అలాంటి వర్మ చేతుల్లోకి స్వర్గీయ ఎన్టీఆర్‌ బయోపిక్‌ వచ్చిందంటే ఇంకేముంది. ఆయన జీవితంలో తెర వెనుక దాగున్న అనేక మంది పాత్ర ధారులు, సూత్రధారులు గుండెల్లో గుబులు పుట్టడం సహజమే. ఇప్పటికే స్వర్గీయ ఎన్టీఆర్‌ రెండవ భార్య లక్ష్మీ పార్వతి తెర పైకి వచ్చి, ఈ విషయమై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కార్యరూపం దాల్చేసరికి ఇంకెన్ని సంచలనాలు జరుగుతాయో, ఆ పై సినిమా విడుదలయ్యాక మరెన్ని సంచలనాలో లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ! 

మరిన్ని సినిమా కబుర్లు
krishnavamshi mark nakshtram movie