కొన్ని సెకన్ల పాటు మాత్రమే అలరించే రీల్ షో టీజర్ అంటే. జస్ట్ ఆ కొన్ని సెకన్లలో సినిమా స్టేటస్ ఏం తెలుస్తుంది చెప్పండి. కానీ ఇప్పుడొస్తున్న టీజర్స్ అలా కాదు. విడుదలకి ముందే సినిమా స్టేటస్‌ని అంచనా వేసేలా చేసేస్తున్నాయి. డైరెక్టర్ విజన్ ఎంత గొప్పగా ఉంటుందో తెలియ జేసేస్తోంది టీజర్. ఒకదానికి మించి ఒక్కోటి అన్నట్లుగా టీజర్స్‌ని కట్ చేస్తున్నారు డైరెక్టర్స్. అలా వచ్చిన టీజర్స్‌లో ఈ మధ్య వచ్చిన టీజర్ 'జై లవ కుశ' ఒకటి, 'లై' ఒకటి స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఇంట్రెస్ట్ ఒక ఎత్తు అయితే, ఒకదానికొకటి పోటీ మరో ఎత్తుగా మారాయి ఈ రెండు టీజర్స్. పురాణ గ్రంధాల్ని ఎంతగానో అవుపాసన పడితే గానీ అలాంటి డైలాగుల్ని సినిమాకి ఆపాదించి అద్భుతంగా చెప్పలేరు అన్నంతగా ఈ రెండు టీజర్స్‌లోని డైలాగ్స్ పోటీపడుతున్నాయి.
ఒకదాన్ని మించి ఇంకోటి అన్నట్లుగా ఉన్నాయి. ఒకటేమో రామాయణం. ఇంకోటేమో మహాభారతం రిఫరెన్స్‌ని అదరహో అనిపించేలా, ప్రతీ ప్రేక్షకున్నీ ఆలోచించేలా చేస్తున్నాయి. 'జై లవ కుశ' డైరెక్టర్ బాబీ. 'లై' డైరెక్టర్ హను రాఘవపూడి. సముద్రమంత ధైర్యం కావాలన్నాడు ఎన్టీయార్. 'లై' సినిమా టీజర్‌తో అబద్ధం ఎంత బలమైనదో చెప్పాడు దర్శకుడు హను. ఈ ఇద్దరూ ఇద్దరే అనక తప్పడం లేదు. వీరు టీజర్స్‌తో జనానికి ఇతిహాస గ్రంధాల్ని అంత చక్కగా చేరువ చేశారు మరి. ఆగష్టులో 'లై' సినిమా విడుదల కానుంది. సెప్టెంబర్‌లో దసరా కానుకగా ఎన్టీఆర్ 'జై లవకుశ'తో రానున్నాడు.
|