'ఎల్‌బిడబ్ల్యూ' సినిమాతో తెలుగు సినీ దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. రెగ్యులర్ ఫార్మేట్ సినిమా కాదిది. అయినా కానీ, అందర్నీ టచ్ చేసింది ఈ సినిమా. ఆ తర్వాత 'చందమామ కథలు' అనే సినిమా నేషనల్ అవార్డు అందుకున్నాడు. రకరకాల కథల్ని ఒకే సినిమాలో మేళవించి చూపించిన సత్తా ఉన్న డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. చిన్న సినిమాలంటే చాలా ఇష్టం ప్రవీణ్‌కి. పెద్ద సినిమాల్ని డీల్ చేయలేక కాదు. కానీ చిన్న సినిమాలంటే ప్రత్యేకమైన మమకారం ఆయనకి. తాజాగా సీనియర్ హీరో రాజశేఖర్‌తో 'గరుడవేగ' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఊహించని మలుపులు, ట్విస్ట్‌లు ఈ సినిమా ప్రత్యేకత. ఎన్‌ఐఏ అధికారి పాత్రలో రాజశేఖర్ నటిస్తున్నాడు ఈ సినిమాలో.
వృత్తికీ, కుటుంబానికి మధ్య నలిగిపోయే ఎన్‌ఐఏ అధికారి జీవిత నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇంతవరకూ ప్రవీణ్ తీసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమా ఓ ఎత్తు. బాలీవుడ్ సెక్సీ భామ సన్నీలియోన్ ఈ సినిమాలో ఐటెం సాంగ్‌లో నటిస్తోంది. ఈ సాంగ్ సినిమాకి ప్రధాన ఆకర్షణ. గతంలో బుల్లితెర యాంకర్ రేష్మీతో 'గుంటూర్ టాకీస్' అనే సినిమాని తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నాడు. త్వరలోనే బ్మాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీంచంద్ బయోపిక్‌ని తెరకెక్కించనున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాని తెరకెక్కించనున్నారట ప్రవీణ్ సత్తారు. గోపీచంద్ జీవితంలో జరిగిన ఇంపార్టెంట్ ఇష్యూస్‌ని ఈ సినిమా ద్వారా చూపించనున్నారట ప్రవీణ్ సత్తారు.
|