Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
perfect directer praaveen sattar

ఈ సంచికలో >> సినిమా >>

గెట్‌ రెడీ ఫర్‌ ఎన్టీయార్‌ 'బిగ్‌' షో

get ready for ntr big show

బుల్లితెరపై ఎన్టీఆర్‌ సందడికి కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ అయిపోయింది. ఎన్టీఆర్‌ హోస్ట్‌గా బుల్లితెర గేమ్‌ షో 'బిగ్‌బాస్‌' అలరించనుందన్న సంగతి తెలిసిందే. ఈ నెల 16 నుండి ఈ షో స్టార్ట్‌ కానుంది. బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా సూపర్‌ హిట్‌ టాక్‌ సంపాదించుకున్న ఈ షోకి తెలుగు వెర్షన్‌లో ఎన్టీఆర్‌ మెరుగులు దిద్దనున్నారు.

ఈ షోలో ఇప్పటికే బుల్లితెరపై తమ సత్తా చాటుతున్న ముద్దుగుమ్మలు పలువురు సెలబ్రిటీస్‌గా పాల్గొననున్నారు. కిర్రాకు పుట్టించే అందాల భామలు స్నేహ, రంభ, మంచు లక్ష్మి, సదా తదితరులు, తూటాల్లాంటి మాటలతో కిక్కెక్కించే నటుడు, రచయిత, నిర్మాత అయిన పోసాని కృష్ణమురళి తదితరులు ఈ షోలో పాల్గొనన్నారనీ ఇప్పటికే అందిన సమాచారమ్‌. 12 మంది సెలబ్రిటీస్‌తో, 71 రోజుల పాటు ఒకే ఇంట్లో 60 కెమెరాల మధ్య ఈ సెలబ్రిటీస్‌ చేసే సందడి కనువిందు చేయనుందట. ఎన్నో ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్స్‌ ఈ షోలో ఉండబోతున్నాయట. ఇప్పటికే ఈ షోకి సంబంధించిన ప్రోమోస్‌ వారెవ్వా అనిపిస్తున్నాయి. ప్రోమోస్‌ చూస్తుంటే ఎప్పుడెప్పుడు ఈ షో స్టార్ట్‌ కానుందా అంటూ బుల్లితెర ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మరో పక్క ఎన్టీఆర్‌ 'జై లవకుశ' సినిమాతో బిజీగా ఉన్నారు. లేటెస్టుగా వచ్చిన 'టీజర్‌తో ఎన్టీఆర్‌ సోషల్‌ మీడియాలో సంచలనాలు సృష్టిస్తున్నాడు.

మరిన్ని సినిమా కబుర్లు
samanta beauty