డైనమిక్ డైరెక్టర్ బి.జయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా 'వైశాఖం'. పేరులోనే ఎంతో ఆహ్లాదం పంచుతోంది ఈ సినిమా. అలాగే చక్కటి కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమాని జయ మలచారట. వేసవి తర్వాత వైశాఖం వస్తుంది అంటే వేసవి తర్వాత మారే వాతావరణం ఎంత ఆహ్లాదంగా ఉంటుందో. అలాగే ప్రస్తుత తరుణంలో ఈ సినిమా ఓ చక్కని మార్పు అంటున్నారు ఆవిడ. తన గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా బడ్జెట్ విషయంలో కూడా వెనుకడుగు వేయకుండా, రాజీ పడకుండా సినిమాని రిచ్‌గా మలచారట. కొత్త నటీనటులతో ఫ్రెష్ లుక్‌తో సినిమాని వినోదాత్మకంగా తెరకెక్కించారట. కుటుంబ సభ్యులంతా హాయిగా కూర్చొని ఈ సినిమాని చేస్తారట. హరీష్, అవంతిక ఈ సినిమాతో హీరో, హీరోయిన్లుగా పరిచయం కానున్నారు. 'చంటిగాడు', 'లవ్‌లీ' సినిమాలతో డైరెక్టర్‌గా తనదైన ముద్ర వేసుకున్న బి. జయ ఈ సినిమాతో అంత కన్నా ఎక్కువగా అలరిస్తానంటున్నారు. ఈ నెల 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆమె తన మనసులోని మాటని బయట పెట్టారు. అక్కినేని బుల్లోడు నాగచైతన్యతో ఓ సినిమా చేయాలని ఉందని అన్నారు. నాగ చైతన్య అంటే తనకెంతో ఇష్టమనీ, నాగ చైతన్యని చూస్తే మన ఇంట్లో కుర్రాడిలా ఉంటాడనీ తప్పకుండా చైతూతో ఓ సినిమా తెరకెక్కిస్తానని ఆమె అన్నారు. బహుశా జయ తదుపరి చిత్రం చైతూతోనే అయినా ఆశ్చర్యపోనక్కర్లేదనిపిస్తోంది.
|