Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
get ready for ntr big show

ఈ సంచికలో >> సినిమా >>

సమంత 'అందం' ఆకాశమంత

samanta beauty

తెలంగాణా చేనేత వస్త్రాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ముద్దుగుమ్మ సమంత వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అదొక పదవి అనుకోకుండా, బాధ్యతగా భావించింది సమంత. అందుకే చేనేత వస్త్రాల్ని ప్రమోట్‌ చేసేందుకుగాను, స్పెషల్‌గా డిజైన్‌ చేయించుకున్న కాస్ట్యూమ్స్‌తో 'జస్ట్‌ ఫర్‌ విమెన్‌' మ్యాగజైన్‌లో కనిపించింది. ఇక్కడి దాకా బాగానే ఉంది. అయితే ఈ మ్యాగజైన్‌ కోసం సమంత ఇచ్చిన హాట్‌ ఫోటో షూట్‌కి అంతా షాకవ్వడమే తమ వంతవుతోంది. అయినప్పటికీ అంత హాట్‌ హాట్‌గా సమంత కనిపించినప్పటికీ, ఆమె ఉద్దేశ్యం చాలా గొప్పది. తెలంగాణ రాష్ట్ర చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా సమంతని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఎంపిక చేశారు. శారీరక అందంలో ఎలాగూ సమంత సూపర్బ్‌. ఇది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆమె మానసిక అందం అద్భుతం.

సమంత ఏం చేసినా అంత ఆషా మాషీగా చేయదండోయ్‌. ఇదే కాదు ఓ ఫౌండేషన్‌ తరఫున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది సమంత. అనాధ పిల్లలు, పేదరికంలో మగ్గుతున్న పిల్లలకి ఈ ట్రస్ట్‌ ద్వారా సమంత, చేయూతగా నిలుస్తూ, వారి బాగోగులు చూసుకుంటోంది. ఓ పక్క సినిమాల్లో బిజీగా ఉంటూనే ఇన్ని పనులు చక్కబెడుతుండడం అభినందనీయం. అది ముద్దుగుమ్మ సమంతకే సాధ్యం. త్వరలోనే చరణ్‌తో 'రంగస్థలమ్‌ 1987'తో ప్రేక్షకుల్ని పలకరించబోతోంది మన శామ్‌ బ్యూటీ. సుకుమార్‌ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam