గ్లామర్ ప్రపంచాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు ఆ ప్రపంచాన్ని తమ వృత్తిగా ఎంచుకున్న ముద్దుగుమ్మలు. అయితే ఆ వృత్తిలో ఉన్న ముద్దుగుమ్మల్ని చాలాసార్లు చులకన చేసి మాట్లాడిన వారున్నారు ఈ సమాజంలో. అలాంటి వారికి గతంలో పలువురు ముద్దుగుమ్మలు చెంప పెట్టుగా షాక్స్ ఇచ్చిన సందర్భాలున్నాయి. అది కేవలం తమ వృత్తి మాత్రమే. జీవితం కాదనీ అందాల భామలు సెలవిచ్చారు. అయితే తాజాగా క్యూట్ బ్యూటీ ఆదాశర్మ ఈ విషయంలో కొంచెం ఘాటుగా స్పందించింది. ఇందుకు బలమైన కారణం ఏదో ఉంది కానీ, ఆదాశర్మ స్పందించిన తీరు వింటే నిజంగా షాక్ అయ్యి తీరాల్సిందే. సోషల్ మీడియాలో ముద్దుగుమ్మలు హాట్ హాట్ పిక్స్‌తో అందాల దాడి చేయడం షరా మామూలే. అదంతా తమ వృత్తిలో భాగమే అంటుంటారు ఈ బ్యూటీస్.
అవును నిజమే అలా స్కిన్ షో చేస్తేనైనా అవకాశాలు వస్తాయేమో అని భావిస్తుంటారు.. అయితే అలా స్కిన్ షో చేసేవారిని సోషల్ మీడియాలో చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారట. అలాగే బహిరంగ ప్రదేశాల్లో హీరోయిన్లు కనిపించినప్పుడు వారిపై అక్కడక్కడా టచ్ చేయడం వంటి అసభ్య ప్రవర్తనలు చేస్తూ ఉంటారు. ఇలా తన పట్ల బిహేవ్ చేస్తే ఊరుకోనంటోంది ముద్దుగుమ్మ ఆదాశర్మ. టచ్ చేస్తే అక్కడికక్కడే చెంప పగులగొట్టేస్తానంటోంది. అంతటితో ఆగకుండా ఇంకా పెద్ద మాటలే వాడేసిందండోయ్ ఈ చిన్నది. ఆదాశర్మకి ఏమంత పెద్ద ప్రాబ్లమ్ వచ్చిందో కానీ, ఇంత ఘాటు స్పందనిచ్చింది. స్పందన కాదిది పెద్ద షాక్ అనే చెప్పాలి. సుతిమెత్తని అందాలతో, క్యూట్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇంత హీటెక్కిపోవడం ఇదే తొలిసారి. అసలే మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం ఉన్న ముద్దుగుమ్మాయె. అందుకే అనుకుంటా మొదట మాటలతోనే దాడి చేసింది. అంతదాకా వస్తే, అంతే సరి, తన పవర్ పంచ్‌లతో రియల్ దాడి చేసేసినా చేస్తుంది. ఆదా విషయంలో జర జాగ్రత్త సుమీ!
|