Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

మళ్ళీ రావా చిత్రసమీక్ష

malli ravaa movie review

చిత్రం: మళ్ళీ రావా 
తారాగణం: సుమంత్‌, ఆకాంక్ష సింగ్‌, అన్నపూర్ణ, అభినవ్‌, మిర్చి కిరణ్‌, అప్పాజీ అంబరీష్‌, సాత్విక్‌, ప్రీతి అశ్రాని, అమాన్‌ తదితరులు. 
సంగీతం: శ్రవణ్‌ భరద్వాజ్‌ 
సినిమాటోగ్రఫీ: శ్రవణ్‌ ముత్యాల 
దర్శకత్వం: గౌతమ్‌ తిన్ననూరి 
నిర్మాత: రాహుల్‌ యాదవ్‌ నక్కా 
నిర్మాణం: స్వధర్మ ఎంటర్‌టైన్‌మెంట్‌ 
విడుదల తేదీ: 8 డిసెంబర్‌ 2017 

క్లుప్తంగా చెప్పాలంటే 
కార్తీక్‌ (సుమంత్‌), అంజలి (ఆకాంక్ష) చిన్నప్పుడే ఒకరినొకరు ఇష్టపడతారు. అయితే అంజలి కుటుంం రాజోలు నుంచి ముంబై వెళ్ళిపోతుంది. అలా ఇద్దరూ విడిపోతారు. 13 ఏళ్ళ తర్వాత కార్తీక్‌ పనిచేసే కంపెనీకి ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా వస్తుంది అంజలి. మళ్ళీ ఆ ఇద్దరి మధ్యా ప్రేమ చిగురిస్తుంది. చిన్నప్పటి స్నేహం, అప్పటి ప్రేమని గుర్తు చేసుకుంటూ ఆ ఇద్దరూ ప్రేమలో మునిగి తేలతారు. ప్రేమని వైవాహిక బంధంగా మలచుకోవాలని ఇద్దరూ అనుకుంటారు. రిజిస్టర్‌ ఆఫీస్‌కి వెళతారుగానీ, అక్కడ కాస్సేపట్లో వివాహం అనగా, అంజలి - కార్తీక్‌ని పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడదు. ఇంతకీ, అంజలి మనసు ఎందుకు మారింది? ఆ తర్వాత ఏమవుతుంది? అనే ప్రశ్నలకు సమాధానం తెరపైనే చూడాలి. 
మొత్తంగా చెప్పాలంటే 
చాలాకాలం తర్వాత సుమంత్‌కి చాలా చక్కటి రోల్‌ దొరికింది ఈ సినిమాలో. చాలా ఈజీగా చేసుకుంటూ పోయాడు. ఒక్కమాటలో చెప్పాలంటే, కార్తీక్‌ పాత్రలో నటించడం కాదు, జీవించేశాడనొచ్చు. సుమంత్‌కి ఇలాంటివి టైలర్‌ మేడ్‌ పాత్రలు. భావోద్వేగాల్ని బాగా పండించాడు. హీరోయిన్‌ ఆకాంక్ష కూడా బాగా నటించింది. ఆమె నటనకీ మంచి మార్కులు పడతాయి. 
హీరో హీరోయిన్ల చిన్నప్పటి పాత్రల్లో కన్పించిన సాత్విక్‌, ప్రీతి అస్రాని కూడా బాగా చేశారు. మిర్చి కిరణ్‌, సుమంత్‌ ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌ అంతా బాగా చేశారు. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర మెప్పించేందుకు ప్రయత్నించారు. 
ఫీల్‌గుడ్‌ మూవీ ఇది. దర్శకుడు సినిమాని బాగా డీల్‌ చేశాడనిపిస్తుంది. కథ, కథనం బాగున్నాయి. అక్కడక్కడా సినిమా కొంత స్లోగా నడుస్తున్నట్లు అనిపిస్తుంటుంది. ఎడిటింగ్‌ ఇంకాస్త బెటర్‌గా ఉంటే బావుండేది. మ్యూజిక్‌ బాగుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఓకే. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణపు విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదు. 
ఈ తరహా సినిమాలకు సంబంధించి బలమైన ఎమోషన్‌తో కూడిన సన్నివేశాలొచ్చినప్పుడు 'సాగతీత' అనే భావన కలగడం సహజం. దాన్ని దర్శకుడు ఎంత బాగా డీల్‌ చేస్తే, సినిమా రిజల్ట్‌ అంత బాగుంటుంది. దర్శకుడు క్లిష్టమైన స్క్రీన్‌ప్లేని రాసుకోవడమే కాదు, దాన్ని జాగ్రత్తగా తెరపైకి తీసుకొచ్చాడు. ఈ విషయంలో దర్శకుడికి మంచి మార్కులు పడతాయి. కొన్ని సన్నివేవాలు సాగతీతగా అన్పించడం మినహాయిస్త, సినిమా ఓవరాల్‌గా మంచి మార్కులేయించుకుంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌నీ, యంగ్‌ జనరేషన్‌నీ సినిమా బాగా ఎట్రాక్ట్‌ చేసే అవకాశాలున్నాయి. క్లాస్‌ ఆడియన్స్‌కి రీచ్‌ అయ్యే ఈ సినిమా మాస్‌ ఆడియన్స్‌ని ఎంతమేరకు ఎట్రాక్ట్‌ చేస్తుందనేది ఇప్పుడే చెప్పలేం. 
ఒక్క మాటలో చెప్పాలంటే 
'మళ్ళీ రావా' ఓ ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌ 
అంకెల్లో చెప్పాలంటే: 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
Mahanati' surprise miracle!