'మనసుకు నచ్చింది' సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ముద్దుగుమ్మ అమైరా దస్తూర్. సూపర్ స్టార్ మహేష్‌బాబు సోదరి మంజుల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నాడు. కాగా తెలుగులో ఈ ముద్దుగుమ్మకి ఇదే తొలి చిత్రం. హాలీవుడ్‌లో జాకీచాన్‌తో 'కుంగ్‌ఫూ యోగా' సినిమాలో నటించిందీ బ్యూటీ. బాలీవుడ్‌లోనూ ఓ సినిమాలో నటించింది. సౌత్‌లో తమిళంలో ధనుష్ సరసన నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగులో చేస్తున్న తొలి సినిమా 'మనసుకు నచ్చింది'. ఈ సినిమాలో నిత్య పాత్రలో కనిపించనుంది అమైరా దస్తూర్. నిత్యగా ట్రెడిషనల్ లుక్‌లో కనిపిస్తాననీ చెబుతోంది కానీ ప్రోమోస్‌లో చాలా హాట్‌గానే కనిపిస్తోంది. ఈ సినిమాలో తన పాత్ర కేవలం పాటలకు పరిమితమైన పాత్ర మాత్రమే కాదంటోంది.
యోగా టీచర్‌గా తన పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందంటోంది. గ్లామర్‌తో పాటు, అభినయానికీ ప్రాధాన్యత ఉన్న పాత్ర అని అమైరా చెబుతోంది. ఈ సినిమా ఫిబ్రవరి 16న విడుదల కానుంది. మరోవైపు 'రాజుగాడు' చిత్రంలోనూ ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. యంగ్ హీరో రాజ్‌తరుణ్ హీరోగా నటిస్తున్నాడు ఈ సినిమాలో. సౌత్‌లో మరిన్ని మంచి అవకాశాలు దక్కించుకోవాలని ఉందంటోందీ హాట్ అండ్ క్యూట్ బ్యూటీ. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటోందట. త్వరలోనే తన పాత్రకి డబ్బింగ్ చెప్పుకుంటానంటోంది. 'రాజుగాడు' సినిమాలో అమైరా దస్తూర్ క్యారెక్టర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతోందట. పర్‌ఫామెన్స్‌తో పాటు, హాట్‌గా కనిపించే పాత్రలోనే నటిస్తుందట . హీరోయిన్‌గా గ్లామరస్ పాత్రలే కాదు, పర్‌ఫామెన్స్ పాత్రల్లో కూడా కనిపిస్తేనే అసలు సిసలు కిక్కు అంటోంది అమైరా. మొత్తానికి ఈ ముద్దుగుమ్మ కొత్త సంవత్సరంలో ఒకేసారి రెండు చిత్రాలతో ప్రేక్షకుల్ని తన అందచందాలతో మెస్మరైజ్ చేయడానికి వచ్చేస్తుందన్న మాట.
|