అందాల సమంత 'రాజగారి గది 2'లో దెయ్యం పాత్రలో కనిపించి, కొంచెం భయపెట్టి, కొంచెం నవ్వించింది. అయితే ఈ సారీ మరో థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో మళ్లీ సమంత ప్రేక్షకుల ముందుకు రానుందట. కన్నడలో ఘన విజయం సాధించిన 'యూటర్న్' సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో సమంత ఓ డైనమిక్ యువతి పాత్రలో కనిపించనుంది. సమంత కెరీర్‌లో ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అని చెబుతోంది. 'రాజుగారి గది-2'లో దెయ్యం పాత్రలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది సమంత. ఆ సినిమాలో నాగార్జున, సమంత పాత్రకి సాయం చేస్తాడు. ఈ సినిమాలో సమంతే, దెయ్యం పాత్రకి సాయం చేస్తుంది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. రోడ్ థ్రిల్లర్ సబ్జెక్ట్ ఇది. ఓ యూటర్న్ కొందరి జీవితాల్లో ఎలాంటి పెను మార్పులకు దారి తీసింది అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది ఈ సినిమా. క్రైమ్ థ్రిల్లర్ అంశాలు,
అలాగే హారర్ అంశాలు చాలా ఉంటాయట. అవన్నీ చాలా కొత్తగా ఉంటాయట. కన్నడ దర్శకుడు పవన్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. మరో పక్క సమంత నటిస్తున్న 'రంగస్థలం' సినిమా నిర్మాణం చివరి దశకు చేరుకుంది. పల్లెటూరి అమ్మాయి పాత్రలో డీ గ్లామర్ రోల్‌లో కనిపించనుంది సమంత ఈ సినిమాలో. మార్చి 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'రంగస్థలం'లో సమంత పాత్రకీ, తాజా చిత్రంలో సమంత పాత్రకీ వైవిధ్యం చాలా ఉంది. అస్సలు పొంతన లేని పాత్రలు ఈ రెండూ. కానీ రెండూ నటిగా సమంతకు ఛాలెంజింగ్ పాత్రలే కావడం గమనించదగ్గ అంశం.
|