ఇద్దరు మెగాహీరోలు. ఒకే రోజు వార్‌కి సిద్ధమవుతున్నారు. వార్ అంటే వార్ కాదండోయ్. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫైట్ ఇది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఓ పక్క. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ మరో పక్క. ఈ ఇద్దరు నటిస్తున్న సినిమాలూ ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మీకో సంగతి తెలుసా? ఈ రెండు సినిమాల్లోనూ చాలా చాలా ఆశక్తికరమైన అంశాలున్నాయి. అవేంటో మీరూ తెలుసుకోవాలనుకుంటున్నారా? ఫస్ట్ టైటిల్ విషయానికి వస్తే బాబాయ్ పవన్ కళ్యాణ్ హిట్ సినిమా టైటిల్ 'తొలిప్రేమ'ని తన సినిమాకి టైటిల్‌గా పెట్టుకున్నాడు వరుణ్ తేజ్. మామయ్య హిట్ సినిమా 'కొండవీటి దొంగ'లోని 'ఛమక్ ఛమక్ చం..' పాటని తన సినిమా'ఇంటెలిజెంట్'లో రీమిక్స్ చేస్తున్నాడు సాయి థరమ్‌తేజ్.
ఇకపోతే హీరోయిన్స్ విషయానికి వస్తే, తేజు సినిమా 'ఇంటెలిజెంట్'లో నటిస్తున్న ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్‌తో 'మిస్టర్' సినిమాలో నటించింది. ఇటు వరుణ్‌తో 'తొలిప్రేమ'లో జత కడుతున్న బ్యూటీ రాశీఖన్నా తేజుతో 'సుప్రీమ్' సినిమాలో నటించింది. ఇలా హీరోయిన్స్‌ని ఎక్స్‌ఛేంజ్ చేసుకున్నారు ఈ మెగా హీరోలిద్దరూ. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్ తేజ్ 'తొలిప్రేమ' తెరకెక్కుతుండగా, వినాయక్ డైరెక్షన్‌లో తేజు 'ఇంటెలిజెంట్' తెరకెక్కుతోంది. రెండు చిత్రాల్లోనూ లవ్ స్టోరీ కీలకం. అయితే ఒకటి సాఫ్ట్ లవ్ స్టోరీ కాగా, ఇంకోటి మాస్ యాక్షన్ లవ్ స్టోరీ. తేజు 'ఇంటెలిజెంట్'లో పెద్ద మామయ్య చిరంజీవిని గుర్తుకు తెస్తే, వరుణ్ తేజ్ బాబాయ్ పవన్ కళ్యాణ్‌ని తలపించేలా ఉన్నాడు. ఇలా ఈ ఇద్దరూ పోటాపోటీగా ఒకేసారి బరిలోకి దిగుతున్నారు. అయితే ఒకేసారి రావడమే కాదు, వచ్చి, బలంగా హిట్ కొడతామని నమ్మకంగా చెబుతున్నాడు సాయి ధరమ్‌తేజ్.
|