హీరోయిన్స్‌కి గాసిప్స్ సర్వ సాధారణ విషయమే. తాజాగా ముద్దుగుమ్మ రాశీఖన్నా చుట్టూ హాట్ హాట్ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. క్రికెటర్ జస్ ప్రీత్ బుమ్రాతో రాశి ఖన్నాకి ఎఫైర్ నడుస్తోందనీ, ఇద్దరూ డేటింగ్‌లో వున్నారనీ ఇటీవల గాసిప్స్ వచ్చాయి. అయితే ఈ గాసిప్స్‌ని రాశి ఖన్నా ఖండించింది. అతన్ని ఎప్పుడూ కలవలేదనీ, అందరికీ తెలిసినట్లే తనకూ ఆయన ఓ క్రికెటర్‌గా మాత్రమే తెలుసని చెబుతూ, బాలీవుడ్ మీడియా వండి వడ్డించిన గాసిప్స్‌పై స్పందించాల్సి వస్తుందని అనుకోలేదంటూ నిట్టూర్చింది.
ఇలాంటి గాసిప్స్ చికాకు కల్గిస్తాయనీ, సినీ పరిశ్రమకు చెందిన తాను ఈ గాసిప్స్‌ని లైట్ తీసుకోగలగినా దేశం కోసం ఎంతో శ్రమించి ఆడే ఆటగాళ్ళకు అవి ఇబ్బందికరమేనని రాశి ఖన్నా అభిప్రాయపడింది. 'రాజా ది గ్రేట్' సినిమాలో గెస్ట్ అప్పీయరెన్స్ రవితేజ మీద వున్న అభిమానంతో చేసిందేననీ, అలా చేసినందుకు ఎలాంటి పారితోషికం తీసుకోలేదని చెప్పిందామె. ఇటీవల విడుదలైన 'తొలిప్రేమ' సినిమాతో రాశీఖన్నా మంచి హిట్ అందుకుంది. 'సుప్రీమ్' సినిమా తర్వాత ఆ స్థాయి హిట్ రాశీఖన్నాని వరించలేదు. కానీ 'తొలిప్రేమ' సినిమా మాత్రం రాశీఖన్నాకి మంచి హిట్‌నిచ్చింది. ఈ తరుణంలో ఆమెని చుట్టుముట్టిన గాసిప్స్ పట్ల ఒకింత బాధగా ఫీలవుతున్నాననీ, ఇలాంటి గాసిప్స్‌కి మామూలుగా అయితే రెస్పాండ్ కావల్సిన అవసరం లేదనీ, ఒకసారి ఊరుకుంటే, అవే గాసిప్స్ ముదిరి పాకాన పడతాయనీ, అందుకే స్పందించాల్సి వచ్చిందనీ రాశీఖన్నా సున్నితంగా చెబుతోంది.
|