మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న 'రంగస్థలం' చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ని ఇటీవల వైజాగ్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఆల్రెడీ సినిమాని చిరంజీవి చూశారట. సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ సుకుమార్‌ని స్పెషల్‌గా ఇంటికి పిలిపించి, చిరంజీవి ప్రశంసించారట. ఈ మాటా ఎంతో ఎగ్జైట్‌మెంట్‌తో సుకుమార్ అభిమానులతో పంచుకున్నారు. ఇకపోతే, సినిమా ఔట్‌పుట్ చాలా బాగా వచ్చిందట. నటుడిగా చరణ్‌ని మరో మెట్టు ఎక్కించేలా ఈ సినిమా ఉండబోతోందని చిరు అన్నారు. అలాగే 150 చిత్రాల్లో నటించిన ఓ నటుడిగా ఇలాంటి సినిమాలో తానెప్పుడూ నటించే అవకాశం రాలేదే అని చరణ్‌పై ఈర్ష్యగా ఉందన్నారు చిరంజీవి. ఇంతవరకూ చూసిన చరణ్ వేరు. 'రంగస్థలం'లోని చరణ్ వేరు. కొత్త చరణ్‌ని అభిమానులకు పరిచయం చేయనున్నాడు 'రంగస్థలం' ద్వారా సుకుమార్. తొలిసారి సమంత, చరణ్‌తో జోడీ కడుతోంది. సమంతతో నటిస్తే ఏ హీరోకైనా కొత్త ఉత్సాహం వస్తుందనీ, సమంతతో కలిసి నటించిన సీన్స్ చాలా బాగా వచ్చాయనీ చరణ్ అన్నారు.
అవార్డుల కోసం సినిమాలు తీయరనీ, కానీ 'రంగస్థలం' మాత్రం ఖచ్చితంగా అవార్డు విన్నింగ్ చిత్రమనీ చిరంజీవి అనడం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బాణీలు చాలా వినసొంపుగా ఉన్నాయి. యంగ్ హీరో ఆదిపినిశెట్టి, అనసూయ భరద్వాజ్, జగపతిబాబు కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లోనే 'రంగస్థలం' ధియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌కి వస్తున్న రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. చిట్టిబాబుగా టీజర్‌తోనే సెన్సేషన్ సృష్టించిన చరణ్, ఇక ట్రైలర్‌తో సృష్టిస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. వీటి సంగతిలా ఉంటే, ఇక సినిమా సృష్టించే అద్భుతాలింకెన్నో చూడాలిక.
|