Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
jayajayadevam

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

 ఒకానొకప్పుడు,  ప్రపంచంలోని సమాచారం ఏదైనా తెలుసుకోవాలనుకప్పుడు, రేడియోలూ,   news papeర్లే  దిక్కు… పాపం వాళ్ళూ సాధ్యమైనంతవరకూ, వివరాలు చెప్పేవారనుకోండి.. ఏదైనా Cricket టెస్ట్ జరిగినప్పుడు, ప్రత్యక్షప్రసారం వినడానికి బాగానే ఉండేది.. కానీ, ఓసారి చూస్తే ఎంతబావుండేదో అని అనిపించేది… అలాగే ఏ రిపబ్లిక్ పెరేడో, లేక ఏ ప్రముఖుడో మన దేశం వస్తే, ఒక్కసారి ఆయనెలా ఉంటారో చూడగలిగితే.. అనే భావం వచ్చేది.. అలాగే మనం ఎన్నో పుస్తకాల్లో చదువుకున్న, విదేశాలు కానీ, దేశంలోనే ఉండే ప్రధాన నగరాలో, పుణ్యక్షేత్రదర్శనాలో, జీవితంలో ఒక్కటంటే ఒక్కసారి చూడగలిగితే, మన జన్మ ఎంత ధన్యమో అని అనుకోనివారుండేవారు కాదు. అంతే కదా మరి, దేనిగురించైనా చదవడం, వినడంకంటే, ప్రత్యక్షంగా చూడగలిగితే పొందే ఆనందం వేరు. మనం చదివినదానికీ, ఆ చూసినదానికీ   relate  చేసి , మన బుర్రలో ఓ ముద్ర వేసేసుకుంటాం. అలాగని  చదివిన ప్రతీదాన్నీ చూడ్డం పెట్టుకుంటే, ఖర్చుతోకూడిన పనాయే..  మనజన్మకింతే  రాసిపెట్టుందని ఓ దండం పెట్టుకుని ఊరుకునేవాళ్ళం.మనకి TV  లాటిదానితో పరిచయమల్లా, ఆరోజుల్లో వచ్చిన  “ మాయాబజార్ “ చిత్రంలో, శ్రీకృష్ణుడు ఇవ్వగా, శశిరేఖా, అభిమన్యుడు , ఓ డ్యూఎట్ పాడుకోవడం వరకూ, లేకపోతే ఏ మాయలఫకీరో, హీరోనో, హీరోయిన్నో ఎక్కడున్నారో తెలుసుకోవడం వరకూ.. నాకైతే బాగా గుర్తు—1956 లో గోదావరి పుష్కరాల్లో రాజమహేంద్రవరం లో చూసినట్టు.

అలాగని  పైన చెప్పినవాటిని అస్సలు చూడలేదా అంటే, అదీ కాదూ…భారతప్రభుత్వ సంస్థ  Films Division  అని ఒకటుండేది. వారు, దేశవిదేశాల్లో జరిగిన సంఘటనల గురించీ, ప్రముఖ వ్యక్తుల గురించీ, ఆటల గురించీ, ఓ డాక్యుమెంటరీయో, లేక ఓ  News Reel  లాటిదో, దేశంలో ఉండే ప్రతీ సినిమా హాల్లోనూ,  అసలు సినిమా మొదలవడానికి ముందు, ఓ పావుగంట చూపించేవారు. సినిమా మాటెలా ఉన్నా, ఈ  Indian News Review  లు చూడ్డానికి మాత్రం అందరూ ఎదురుచూసేవారు.

టెక్నాలజీ అభివృధ్ధితో పాటు,  టెలివిజన్లు వచ్చేసాయి దేశంలోకి..1970 లో అనుకుంటా, కొన్ని ప్రధాన నగరాల్లో  మొదలెట్టారు, అదీ  Black and White  లో మాత్రమే..ఆ నగరాల్లో ఉండేవారికి , ప్రతీదీ ప్రత్యక్షంగా చూడగలిగే అవకాశం కలిగింది. ఆ తరవాత దేశంలో చాలాచోట్ల  LPT  లని పెట్టి, వాటిద్వారా ఆ టవర్ చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల పరిధిలో బొమ్మ కనిపించేది… కొత్తగా ఈ  Black and White TVs  వచ్చినప్పుడు తమాషాగా ఉండేది--  TV  ఉన్న ఇంటికి సంకేతం ఏమిటయ్యా అంటే, ఏ డాబామీదో ఎత్తుగా, ఓ  Aluminium  లాటిదుండేది, దాన్ని  Antenna  అనేవారు. ఆ  LPT  ఉన్న దిక్కుకేసి పెట్టేవారు. సరీగ్గా ఉన్నంతకాలం బొమ్మ బాగానే వచ్చేది, ఏ గాలో వీసి ఆ యాంటెన్నా కదిలిందా, దానితోపాటే బొమ్మ కూడా గాయెబ్.. ఎవరోఒకరు డాబా మీదకి వెళ్ళి ఆ యాంటెన్నాని సద్దడం… ఆ టీవీలో వచ్చేదా ఒకేఒక్క చానెల్—అదీ ప్రభుత్వం వారిదే.. దూర్ దర్శన్ అనేవారు… అదొక్కటే చానెల్…
క్రమక్రమంగా, రంగుల టీవీలూ, వందలకొద్దీ చానెల్సూ వచ్చి చిరాకుపెడుతున్నాయి..  వివిధభాషల్లో వార్తలు, వినోదమూ, భక్తీ  అడక్కండి ప్రతీవిభాగానికీ ఎన్నోఎన్నెన్నో చానెళ్ళు..  వార్తల విషయానికొస్తే తలొకడిదీ తలోమాటానూ.. ఇంక వినోదం పేరుచెప్పి, జీడిపాకంలా సంవత్సరాలు సాగే సీరియళ్ళ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది…

ఇంక ఈవిడియో  టెక్నాలజీ అంచెలంచెలుగా అభివృధ్ధి చెంది, మన జీవితాలతో పెనవేసుకుపోయింది. ఇదివరకటి రోజుల్లో ఎవరైనా గర్భవతి అయితే, తొమ్మిదినెలలూ ఆగేవారు పుట్టేది ఆడో మగో తెలిసికోడానికి, ఈ రోజుల్లో అదేదో స్కానింగ్ అని పేరుపెట్టి , ఆ లోపలుండే పిండాన్ని, పక్కనే ఓ Monitor  లో చూడగలిగేటంతగా.. ఇంక రోడ్లమీదైతే ప్రతీచోటా CC cameras..  ఎవడొచ్చాడో, ఎవడుపోయాడో తెలుసుకోడానికి… వీటికి సాయం కొత్తగా వచ్చే  Smart Phone  లలోకి కూడా ఈ టీవీ లే. కారులో వెళ్తూ సినిమా చూస్తూ, రోడ్డుమీదవెళ్ళే ఎవడినో గుద్దేయొచ్చు. ఏమిటీ చూసుకుంటూ కారు నడపలేవా అని అడిగితే, టీవీ చూస్తున్నానూ అంటాడు… ఏ విదేశాల్లోనో ఉండేపిల్లలలు దేశంలో ఉండే తల్లితో మాట్టాడాలంటే.. video chatting. అంతదాకా ఎందుకూ, కర్మకాండలుకూడా, అదేదో video camera  లోనే చేసేసి చేతులు దులిపేసుకుంటున్నారనడంలో ఆశ్చర్యం లేదు.

టెక్నాలజీ అభివృధ్ధి ధర్మమా అని సంబంధబాంధవ్యాలు పెరిగేయి కానీ, ఆ  Human Touch స్పర్శ అన్నది మాత్రం కొండెక్కేసింది….

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
thailand