Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Chinta Chuguru Pachadi

ఈ సంచికలో >> శీర్షికలు >>

మాగల్ఫ్.కామ్ 3వ వార్షికోత్సవం - ..

maa gulf.com
 
యు.ఎ.ఇ, కతార్, బెహ్రెయిన్, ఓమన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియాల్లో నివసిస్తున్న తెలుగువారికి ఒక వేదికగా ఆవిర్భవించిన మాగల్ఫ్.కాం విజయవంతంగా మూడు వర్షాలు పూర్తి చేసుకుని నాలుగవ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. దుబాయి కేంద్రంగా నడుస్తున్న ఈ పోర్టల్ అటు ఆయా దేశల్లో ఉన్న తెలుగువారికి- ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లోని తెలుగు వారికి నడుమ ఒక వారధిగా నిలుస్తూ ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారాన్ని అందివ్వడమే కాకుండా అవసరమైన వారికి వెన్నుదన్నుగా ఉంటూ పలువురి మన్ననలు అందుకుంటోంది. మూడేళ్ల ఈ అనతి కాలంలో మాగల్ఫ్ ను యు.ఎ.ఇ ప్రభుత్వ యంత్రాంగం, అక్కడి అధికారిక మీడియా విభాగాలు కూడా గుర్తించడం గమనార్హం. 
 
"తెలుగువారికి సహాయపడాలన్న ఏకైక లక్ష్యంతో మాగల్ఫ్ ను స్థాపించాం. ఊహించిన దానికంటే త్వరగా నలుగురిని చేరడమే కాకుండా ఊహించని మన్ననలు, గుర్తింపు, అభిమానం పొందగలగడం మరింత ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా, మరిన్ని ఉపయుక్తమైన లక్ష్యాలతో ముందుకు వెళ్లడానికి సంకల్పించాం. త్వరలో ఆ వివరాలు తెలుపుతాం" అని మాగల్ఫ్ వ్యవస్థాపకులు శ్రీ చిత్తర్వు శ్రీకాంత్ గోతెలుగు.కాం ప్రతినిధితో తెలిపారు. 
 
ఇప్పటికే ప్రవాసిమిత్ర, ఇండీవుడ్ అవార్డులను గెలుచుకున్న శ్రీ చిత్తర్వు శ్రీకాంత్ టివి5 ఛానల్ కు గల్ఫ్ దేశాల ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.
మరిన్ని శీర్షికలు
sarasadarahasam