Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

రకుల్‌ మనసుకు గాయం చేసిందెవరు

srireddy says sorry to rakul

సినీ పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌ వివాదానికి సంబంధించి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి పరుష పదజాలంతో దూషించింది. సినీ పరిశ్రమలో తాను కాస్టింగ్‌ కౌచ్‌ని ఎదుర్కోలేదని రకుల్‌ప్రీత్‌సింగ్‌ చెప్పడమే అందుకు కారణం. అది ఆమె అభిప్రాయం. నిజంగానే ఆమెకు ఆ సమస్య ఎదురవలేదని ఎవరైనా అర్ధం చేసుకోవాలి. కానీ, శ్రీరెడ్డి మాత్రం హద్దులు దాటేసింది. నానా రకాలుగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌పై విరుచుకుపడి చివరకు క్షమాపణలు చెప్పింది. అదలా ఉంటే, తాజాగా రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఈ వివాదంపై స్పందించింది.

నా అభిప్రాయాన్ని నేను చెప్పడం చాలా పెద్ద తప్పిదంగా కొందరు వక్రీకరించారు. ఇప్పటికీ, నా మాటలకు నేను కట్టుబడి ఉన్నాను. తమిళ, తెలుగు, హిందీ పరిశ్రమల్లో ఎక్కడా నాకు కాస్టింగ్‌ కౌచ్‌ అనే సమస్య ఎదురు కాలేదు. సినిమా సినిమాకీ నన్ను నేను తీర్చి దిద్దుకుంటూ ముందుకెళ్తున్నాను. నాలాగే అందరూ సినీ పరిశ్రమలో రాణిస్తున్నారనీ, రాణించాలనీ కోరుకుంటున్నాను. వివాదాలకు ఎంత దూరంగా ఉన్నా సరే ఒక్కోసారి ఇలాంటి సమస్యలు తప్పవు. సినీ రంగంలోకి వచ్చాక నేను చాలా బాధపడిన సందర్భం ఇది అని రకుల్‌ చెప్పింది. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ అంటే కేవలం నటి మాత్రమే కాదు, సామాజిక బాధ్యత ఉంది ఆమెకి. ఓ వైపు సినిమాలు, ఇంకోవైపు ఫిట్‌నెస్‌ స్టూడియోల వ్యాపారం, వీలు చిక్కితే సామాజిక సేవ.. ఇదే రకుల్‌ ప్రపంచం. ప్రస్తుతం రకుల్‌ ప్రీత్‌సింగ్‌ తమిళంలో మూడు చిత్రాల్లో నటిస్తోంది. 

మరిన్ని సినిమా కబుర్లు
Will the 'Mahanaty' be a miracle?