Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
srireddy says sorry to rakul

ఈ సంచికలో >> సినిమా >>

'మహానటి' మహాద్భుతం అవుతుందా?

Will the 'Mahanaty' be a miracle?

తెలుగు సినీ పరిశ్రమకి సంబంధించి లేడీ సూపర్‌స్టార్‌ అన్నా, మహానటి అన్నా సావిత్రి మాత్రమే. ఆమెకి సాటి ఇంకెవరూ రారు. ఆ మహానటి జీవితం తెరిచిన పుస్తకం. కీర్తి ప్రతిష్ఠల పరంగా ఎవరెస్ట్‌ శిఖరం, అలాగే, ఆమె జీవితంలో చాలామందికి తెలియని అగాధాలు కూడా ఉన్నాయి. ఆ మహానటి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కుతోంది. ఉన్నది ఉన్నట్లుగా, జరిగింది జరిగినట్లుగా 'మహానటి'లో చూపించబోతున్నారు. ఆడియో రిలీజ్‌ అయ్యింది. ఎన్టీఆర్‌, నాగార్జున, నాని తదితరులు ఈ ఫంక్షన్‌లో ప్రధాన ఆకర్షిణగా నిలిచారు. ఈ సందర్భంగా సావిత్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

తనకి నటించే అవకాశం రాకపోయినా, తన కొడుకు, కోడలు ఈ సినిమాలో నటించడం తనకెంతో ఆనందంగా ఉందని నాగార్జున అన్నారు. కీర్తిసురేష్‌ని ప్రశంసలతో ముంచెత్తేశారు. సీతారామశాస్త్రి వంటి మహానుభావులతో ప్రశంసించుకోవడం అంటే చిన్న విషయం కాదు. అంత చక్కటి నటనా ప్రతిభను కనబర్చింది కీర్తి సురేష్‌. రెండో సావిత్రి కీర్తి సురేష్‌. అంతగా తనకి తాను ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసింది కీర్తి సురేష్‌ అని అంతా ఆమెని ప్రశంసలతో ముంచెత్తేశారు. ఎన్టీఆర్‌కి ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చినా కానీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నాగ చైతన్య నటించాడు. సమంతది ఓ కీలక పాత్ర ఈ సినిమాలో. విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌, రాజేంద్రప్రసాద్‌, మోహన్‌బాబు, భానుప్రియ, దివ్యవాణి, ప్రకాష్‌రాజ్‌, షాలినీ పాండే, మాళవికా నాయర్‌ తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మే 9న 'మహానటి' ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మరిన్ని సినిమా కబుర్లు
Bharat  mega appreciated