మెగాపవర్‌స్టార్ పవర్ ఏంటనేది ప్రూవ్ చేసిన సినిమా 'రంగస్థలం'. ఇలాంటి సినిమాలతో కూడా రికార్డులు కొల్లగొట్టొచ్చు అని నిరూపించిన హీరో రామ్‌చరణ్. 'రంగస్థలం' వంటి నాన్ కమర్షియల్ మూవీతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసేశాడు. అంతదాకా సరైన హిట్ లేక అల్లల్లాడిపోతోన్న తెలుగు సినిమాని అలా పట్టుకుని అమాంతం పైకి లేపిన మొనగాడు రామ్‌చరణ్. 'రంగస్థలం' సినిమా విడుదలై నెలరోజులు కావస్తోంది. అయినా వసూళ్లలో ఏమాత్రం జోరు తగ్గడం లేదు. ఈ మధ్య కాలంలో ఏ సినిమా ఇన్ని రోజులు ఆడింది లేదు. మధ్యలో సూపర్‌స్టార్ మహేష్ నటించిన 'భరత్ అనే నేను' వంటి పెద్ద సినిమా రిలీజైనా కానీ 'రంగస్థలం' వసూళ్లలో ఏమాత్రం తేడా కనిపించలేదు. 'రంగస్థలం' ప్రదర్శించబడుతున్న ధియేటర్స్‌లో ఇంకా హౌస్‌ఫుల్స్ నమోదవుతున్నాయి.
అఫీషియల్‌గా ఈ సినిమా 200 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయిందని ట్రేడ్ పండితులు తేల్చేశారు. 125 కోట్లు పైగా షేర్ తెచ్చిపెట్టింది ఈ సినిమా. సుకుమార్ తన మనసులో మెదిలిన ఆలోచనను చరణ్ ముందుంచితే, చరణ్ రిస్క్ తీసుకుని ఈ సినిమాకి సైన్ చేశాడు. కథపై ఉన్న నమ్మకంతోనే చరణ్ ఈ సినిమాని ఒప్పుకున్నాడు. మొదట్లో చరణ్‌లాంటి స్టార్ హీరో ఇలాంటి కథని ఎంచుకోవడమేంటా? అని అంతా విమర్శించారు. కానీ సినిమా విడుదలయ్యాక సత్తా ఏంటో చూపించాడు. ఓవర్సీస్‌లో 4.1 మిలియన్ డాలర్లు వసూళ్లు కొల్లగొట్టి సరికొత్త రికార్డు సృష్టించాడు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్. ఓవరాల్‌గా ఇప్పటికి 200 కోట్లు కొల్లగొట్టిన 'రంగస్థలం' ఇంకా నాటౌట్ కాకుండా, విజయవంతంగా ప్రదర్శితమవుతుండడం విశేషం.
|