'నా పేరు సూర్య' నిరాశపరిచింది. జెన్యూన్ అటెంప్ట్ అయినా కమర్షియల్‌గా అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది. ఇప్పుడు అల్లు అర్జున్‌కి 'రేసుగుర్రం' లాంటి హిట్ కావాలి. చరణ్‌కి 'రంగస్థలం' సినిమా రిస్కీ అటెంప్ట్ అయినా ఊహించని విధంగా కలిసొచ్చింది. అలాగే కొంతమంది చిన్న హీరోలకీ ఒక్కోసారి ప్రయోగాలు లక్కీగా కలిసొస్తున్నాయి. ఎందుకో కానీ బన్నీకి ప్రయోగాలు పని చేయడం లేదు. అందుకే బన్నీ ట్రాక్ మార్చాలనుకుంటున్నాడట. 'నా పేరు సూర్య' రిజల్ట్‌తో బన్నీ కన్‌ఫ్యూజన్‌లో పడిపోయాడు.
నెక్ట్స్ ఏం చేయాలన్న దానిపై క్లారిటీ లేదు. అయితే మళ్లీ రామలక్ష్మీ బ్యానర్‌లోనే ఓ సినిమా అల్లు అర్జున్ చేయొచ్చని తెలుస్తోంది. దర్శకుడు ఎవరన్నది జూన్ మొదటి వారంలో తెలియనుంది. 'రేసుగుర్రం' నుండి 'సరైనోడు' వరకూ బన్నీకి తిరుగే లేకుండా పోయింది. 'డీజె'తో బన్నీ సక్సెస్‌కి బ్రేక్ పడింది. భారీ అంచనాలతో తెరకెక్కిన 'నా పేరు సూర్య'ని సక్సెస్‌లో నిలబెట్టేందుకు చాలా కష్టపడ్డారు కానీ, రిజల్ట్ విషయంలో ఆశించిన విధంగా రీచ్ కాలేకపోయారు. తన వరకూ తాను బన్నీ పడాల్సిన కష్టమంతా పడ్డాడు. కానీ కమర్షియల్ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది ఈ సినిమా. చూడాలి మరి బన్నీ నెక్ట్స్ మూవీ కోసం ఎలాంటి కాన్సెప్ట్‌ని ఎంచుకుంటాడో అభిమానుల్ని ఎలా శాటిస్‌ఫై చేస్తాడో..!
|