అక్కినేని నాగార్జునతో రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం 'ఆఫీసర్' వివాదాల కారణంగా ఈ నెల 25న విడుదల కావల్సింది కాస్తా జూన్ 1కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇకపోతే వర్మ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటబ్బా అంటే, వర్మ నెక్ట్స్ అఖిల్‌తో సినిమా చేయనున్నాడనీ టాక్ వినిపిస్తోంది. గతంలోనే వర్మ, అఖిల్‌తో సినిమా చేసేందుకు నాగ్ దగ్గర మాట తీసుకున్నాడు. ఆ క్రమంలోనే 'ఆఫీసర్' తర్వాత అఖిల్‌తో సినిమా చేస్తాడని అనుకుంటున్నారు. అయితే అఖిల్ ప్రస్తుతం 'తొలిప్రేమ' డైరెక్టర్ వెంకీ అట్లూరి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే వర్మతో సినిమాకి రెడీ అవుతాడేమో చూడాలిక. ఇకపోతే అసలే ఫెయిల్యూర్స్ మీదున్న వర్మకి నాగార్జున 'ఆఫీసర్' ఓ సంజీవనిలా లభించింది.
అలాంటి ఈ సంజీవని హిట్ అయితే వర్మ బౌన్స్ బ్యాక్ కాగలడు. ఒకవేళ ఈ సినిమా బెడిసికొడితే, అఖిల్‌తో సినిమాకి నాగ్ ఒప్పుకుంటాడో లేదో సస్పెన్సే మరి. మరోవైపు వర్మ ఎన్టీఆర్ బయోపిక్‌కి సంబంధించి ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. ఎప్పుడో ఫిబ్రవరిలోనే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాని స్టార్ట్ చేస్తానని చెప్పిన వర్మ ఆ సినిమా ఊసే ఎత్తడం లేదు. ఒకవేళ 'ఆఫీసర్' తర్వాత అఖిల్ సినిమాకి గ్యాప్ తీసుకుంటే, ఆ గ్యాప్‌లో 'లక్ష్మీస్ ఎన్టీఆర్'ని పట్టాలెక్కిస్తాడేమో వర్మ చూడాలి మరి. 'ఆఫీసర్' సినిమా గురించి ఎవరేమనుకున్నాసరే, ఇటు వర్మ అటు నాగార్జున మాత్రం కంప్లీట్ కాన్ఫిడెన్స్‌తో కన్పిస్తున్నారు. 'శివ' లాంటి ట్రెండ్ సెట్టర్‌గా 'ఆఫీసర్' విజయం సాధిస్తుందన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ సమాచారం. అదే నిజమైతే, అఖిల్‌తో వర్మ సినిమా వీలైనంత వేగంగా పట్టాలెక్కొచ్చు.
|