Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
What is Varma movie with Akhil?

ఈ సంచికలో >> సినిమా >>

మెగాస్టార్‌ అల్లుడు 'విజేత' అవుతాడా.?

Megastar alludu becomes 'winner'

చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌దేవ్‌ హీరోగా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న చిత్రానికి 'విజేత' అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. ఈ విషయం ఖరారు చేస్తూ చిత్ర యూనిట్‌ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది. ఓ వ్యక్తి చిన్న పిల్లాడి చేయి పట్టుకున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్‌ ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తోంది. అభిరుచి గల చిత్రాలెన్నో నిర్మించిన వారాహి సంస్థ బ్యానర్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. రాకేష్‌ శశి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా చిరంజీవి కెరీర్‌ బెస్ట్‌ మూవీస్‌లో ఒకటైన 'విజేత' సినిమా టైటిల్‌ని అల్లుడి ఫస్ట్‌ సినిమా టైటిల్‌గా పెట్టడంతో మెగా అభిమానుల దృష్టిని మొదట్లోనే ఆకర్షించేశాడు

హీరో కళ్యాణ్‌ దేవ్‌. 'ఇతరుల ముఖాల్లో చిరునవ్వు తెప్పించడం కూడా విజయమే..' అనే క్యాప్షన్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం ఓ వినూత్నమైన మెసేజ్‌ని అందించబోతోందని తెలుస్తోంది. ఇకపోతే హీరోకి ఉండాల్సిన కరెక్ట్‌ ఫిజిక్‌, హ్యాండ్‌సమ్‌ లుక్స్‌తో కళ్యాణ్‌ దేవ్‌ ఆకట్టుకుంటున్నాడు. షూటింగ్‌ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం తదుపరి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీ కానుంది. కళ్యాణ్‌దేవ్‌కి ఇది తొలి చిత్రమే అయినా బడ్జెట్‌లో ఎక్కడా రాజీపడకుండా, సాంకేతికంగా చాలా రిచ్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. 'బాహుబలి' సినిమాకి పని చేసిన కెమెరామేన్‌ సెంథిల్‌ కుమార్‌ ఈ సినిమాకి వర్క్‌ చేయడం విశేషం. ఈ సినిమాలో దేవ్‌కి జంటగా ముద్దుగుమ్మ మాళవికా నాయర్‌ నటిస్తోంది. 'ఎవడే సుబ్రహ్మణ్యం', 'కళ్యాణ వైభోగమే' తదితర చిత్రాలతో మంచి టాలెంట్‌ ఉన్న హీరోయిన్‌ అనిపించుకుంది మాళవికా నాయర్‌. 

మరిన్ని సినిమా కబుర్లు
Anushka told no glamor.