అనుష్క అంటే గ్లామర్. గ్లామర్ అంటే అనుష్క. కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు అనుష్క హుందా అయిన పాత్రలకే ఫిక్స్ అయిపోయింది. 'సైజ్ జీరో' సినిమాతో అనుష్క చేసిన ప్రయోగం విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ, సినిమా ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. ఆ సినిమా కోసం అనుష్క కష్టపడి పెంచిన బరువును భారం తీర్చుకోలేకపోతోంది. ఎంత కష్టపడినా అనుష్క బరువు తగ్గడం లేదు. మునుపటిలా తన ఫిజిక్‌ని పొందలేకపోతోంది. దాంతో గ్లామరస్ పాత్రల్లో అనుష్కను చూడడం కష్టమంటున్నారు
అభిమానులు. అందుకే అనుష్క కూడా ఫిక్సయిపోయిందట. ఇకపై గ్లామర్ పాత్రల్లో తనని చూడలేకపోవచ్చునని చెబుతోంది. డిగ్నిఫైడ్‌గా కనిపించేందుకే ట్రై చేస్తానంటోంది. ఇటీవల 'భాగమతి' సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన అనుష్క ఆ తర్వాత ఎలాంటి సబ్జెక్ట్‌ని ఎంచుకోవాలా అని ఆలోచనలో పడిందట. 'భాగమతి'కి వచ్చిన రెస్పాన్స్‌తో హీరోయిన్ సెంట్రిక్ స్క్రిప్టులతో కొత్త డైరెక్టర్లు అనుష్క వద్దకు క్యూ కడుతున్నారట. అందులో భాగంగానే డైరెక్టర్ హేమంత్ మధుకర్ తాజాగా అనుష్కకు ఓ స్టోరీ వినిపించాడనీ సమాచారమ్. ఈ స్టోరీ లైన్ అనుష్కకు నచ్చిందట. అయితే ఇది కూడా 'భాగమతి'లానే సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్ట్ అట. హారర్ టచ్ కూడా ఉంటుందట. మళ్లీ అదే జోనర్‌ని ఎంచుకుంటే ఆడియన్స్ ఎలా రెస్పాండ్ అవుతారా? అని అనుష్క యోచిస్తోందట. అతి త్వరలోనే ఈ సబ్జెక్ట్‌ని ఎంచుకోవాలా? వద్దా? అని ఓ క్లారిటీకి రానుందట అనుష్క. ఒకవేళ అనుష్క అంగీకరిస్తే, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఆ సంస్థ వారు రెడీగా ఉన్నారట. ఇక స్వీటీదే ఫైనల్ డెసిషన్.
|