Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Anushka told no glamor.

ఈ సంచికలో >> సినిమా >>

సూపర్‌స్టార్‌ సరసన సిమ్రాన్‌

super star with simran

ఒకప్పుడు అగ్ర కథానాయికగా స్టార్‌ హీరోలందరి సరసన నటించి, ఓ వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ సిమ్రన్‌ ఈ మధ్యనే సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసింది. పెళ్లి చేసుకుని కొన్నాళ్లు వైవాహిక జీవితాన్ని అనుభవించి, మాతృత్వపు తీయదనాన్ని కూడా ఆస్వాదించిన సిమ్రన్‌ తన ఫిజిక్‌ని మాత్రం కంట్రోల్‌లోనే ఉంచుకుంది. అందుకే పెళ్లైనా, తల్లైనా కానీ ఆమె గ్లామర్‌లో ఏమాత్రం మార్పు రాలేదు. ఆ మాటకొస్తే మరింత అందంగా మారింది సిమ్రన్‌. తమిళంలో ప్రస్తుతం సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసిన జ్యోతిక తదితర ముద్దుగుమ్మలు బిజీ బిజీగా సినిమాలు చేస్తూ, అప్‌ కమింగ్‌ హీరోయిన్స్‌కి గట్టి పోటీ ఇస్తున్నారు.

ఆ కోవలోనే సిమ్రన్‌ కూడా ప్రస్తుతం మూడు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. ఇవన్నీ కాక లేటెస్టుగా ఓ బంపర్‌ ఆఫర్‌ కొట్టేసింది అందాల సిమ్రన్‌. అదేంటంటే తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా త్రిష, నయనతారలతో పాటు, దీపికా తదితర బాలీవుడ్‌ ముద్దుగుమ్మల పేర్లు కూడా వినిపించాయి. వారెవరూ కాదని లేటెస్టుగా ఆ పాత్రకు సిమ్రన్‌ని ఫైనల్‌ చేశారనీ తెలుస్తోంది. అంటే సిమ్రన్‌ త్వరలోనే తెలుగులోకీ అడుగుపెట్టే అవకాశాలున్నాయన్న మాట. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాగా సిమ్రన్‌, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో జోడీ కట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి అనిరుధ్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondichooddam