వెండితెరపై నేచురల్ స్టార్‌గా యూత్‌నీ, ఫ్యామిలీ ఆడియన్స్‌నీ ఎట్రాక్ట్ చేస్తూ యంగ్ హీరోల్లో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న నాని ఇప్పుడు బుల్లితెర ద్వారా అందరి ఇంట్లోకీ వచ్చేశాడు. బుల్లితెరపై ప్రసారమవుతున్న మెగా రియాల్టీ షో 'బిగ్‌బాస్'కి హోస్ట్‌గా నాని వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. హోస్ట్‌గా తొలి వీక్ ఫర్వాలేదనిపించినా, తనదైన శైలి చురుక్కులు చమక్కులతో సెకండ్ వీక్‌కల్లా నాని తన స్టైల్ చూపించేశాడు. ఎట్రాక్ట్ చేసేశాడు. అయితే మూడో వారం ఎలిమినేషన్‌లో భాగంగా సెలబ్రిటీ కిరీటిని ఎలిమినేట్ చేశాడు నాని. ఈ వీక్ ఎలిమినేషన్‌కి ఏ ఇష్యూ అయితే కారణమైందో, ఆ ఇష్యూకి సంబంధించి నాని చేసిన కామెంట్, నాని ఇమేజ్‌ని డ్యామేజ్ చేసేసింది.
దాంతో బిగ్‌బాస్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. టోటల్‌గా బిగ్‌బాస్ ఎలిమినేషన్ వ్యవహారం అంతా డ్రమటిక్‌గా ఉందనీ ఆడియన్స్ భావిస్తున్నారు. బిగ్‌బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన ప్రతీ కంటెస్టెంట్ నానిపై గుస్సాగున్నారనే అనిపిస్తోంది. మొదట బయటికి వచ్చిన సంజన నాని ఇష్టం లేదంది. ఇప్పుడు కిరీటికి కూడా నానిపై చాలా కోపం ఉందని పరోక్షంగా తెలుస్తోంది. అయితే వాస్తవానికి ఎలిమినేషన్ వ్యవహారంలో నానికి ఏమాత్రం జోక్యం లేదు. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే నాని ఎలిమినేషన్‌ని ప్రకటిస్తాడు అంతే. అయితే తనపై వస్తున్న ఈ ఆరోపణలను ఈ వీక్ ఏమైనా మేనేజ్ చేస్తాడేమో చూడాలి నాని.
|