క్యూట్ భామ అనుపమా పరమేశ్వరన్ మనసు మార్చుకుందట. ఇంత వరకూ క్యూట్‌గా ట్రెడిషనల్‌గా కనిపించిన ఈ బ్యూటీ ఇకపై గ్లామరస్ పాత్రలకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలనుకుంటోందట. తాజాగా 'తేజ్ ఐ లవ్‌యూ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిందీ బ్యూటీ. ఇంతవరకూ ఆచి తూచి సినిమాలను ఎంచుకున్న ఈ ముద్దుగుమ్మ ఇక నుండి వచ్చిన ప్రతీ అవకాశాన్నీ వినియోగించుకుంటానంటోంది. అలా అని మరీ తొందరపాటుగా వ్యవహరించదట కానీ, కాస్త దూకుడు అయితే పెంచుతానంటోంది. మరి పెంచిన దూకుడులో భాగంగానే కాస్త గ్లామర్ తెరలు కూడా తొలగిస్తానంటోంది. అనుపమా యాక్టింగ్ టాలెంట్ గురించి తెలిసిందే.
అయితే గ్లామర్ విషయంలోనే ఇంతవరకూ కంచెలు వేసుకుంది. ఇక ఆ గ్లామర్ తెరలు కూడా తొలిగిస్తానంటే ఇంకేం అవకాశాలు కోకొల్లలే అని చెప్పాలి. ప్రస్తుతం ఈ బ్యూటీ యంగ్‌హీరో రామ్‌తో 'హలో గురూ ప్రేమ కోసమే' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాతోనే తనలోని గ్లామర్ యాంగిల్‌ని మెల్ల మెల్లగా రివీల్ చేస్తానంటూ సంకేతాలు పంపుతోంది. అయినా అనుపమా అంటే ఇది అని ఓ అంచనాకి వచ్చేశారు ఇంతవరకూ ప్రేక్షకులు. అయితే ఇప్పుడు న్యూ యాంగిల్‌ని చూపిస్తానంటోంది. ఈ న్యూ ఛేంజ్‌తో అనుపమా ఎలా ఆకట్టుకుంటుందో తొందర్లోనే మనమూ చూసేద్దాం.
|