ఒకప్పటి హీరోయిన్ గౌతమి క్యాన్సర్‌తో బాధపడిందంటే నమ్మగలమా? అవును ఇది నిజం. ఆమె క్యాన్సర్‌తో బాధపడడమే కాదు, పోరాడి జయించింది. జయించడమే కాదు, ఆ తర్వాత క్యాన్సర్ బాధితులకు దాన్ని జయించడమెలాగో చెప్పేందుకు పలు అవగాహనా కార్యక్రమాలు చేపట్టింది. క్యాన్సర్ బాధితులకు కావల్సిన ధైర్యాన్ని నూరిపోసింది. అయినా కానీ క్యాన్సర్ అంటే ఇప్పటికీ భయమే. దానికి వైద్యం కూడా కష్టతరమే. అయినా కానీ ధైర్యంతో అతి భయంకరమైన ఆ వ్యాధిని జయించొచ్చని గౌతమి వంటి సెలబ్రిటీస్ చాలా మంది ప్రూవ్ చేశారు. బాలీవుడ్ నటి మనీషా కోయిరాల కూడా క్యాన్సర్‌ని జయించింది.
ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా అంతే. వీరంతా క్యాన్సర్‌ని జయించి, తిరగొచ్చి మళ్లీ తమ తమ కెరీర్స్‌లో బిజీ అయిపోయినవారే. ఇప్పుడెందుకు ఈ ఇష్యూ డిస్కస్ చేసుకోవాల్సి వస్తోందంటే, తాజాగా ఈ క్యాన్సర్ మహమ్మారి మరో సెలబ్రిటీని కబళించేసింది. ఆమె ఎవరో కాదు, 'ఇంద్ర', 'శంకర్‌దాదా ఎమ్‌బీబీఎస్', 'మన్మధుడు', 'మురారి' తదితర పాపులర్ చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ సోనాలి బింద్రే. ఈ ముద్దుగుమ్మకు ఒంట్లో అస్వస్థత కారణంగా వైద్య పరీక్షల నిమిత్తం వెళితే, తనకి క్యాన్సర్ ఉందని తెలిసింది. అయితే కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలతో తాను కూడా క్యాన్సర్‌ని జయిస్తానని చెబుతోంది. ఇటీవల ఈ విషయాన్ని సోనాలి బింద్రే సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ విషయం తెలిసిన అభిమానులు ఒక్కసారి షాకయ్యారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో క్యాన్సర్‌కి చికిత్స చేయించుకుంటోంది సోనాలి బింద్రే.
|