ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'రోబో 2.0' సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. గతేడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రావల్సిన ఈ సినిమా ఈ ఏడాదిలో ఇంకా విడుదలకు నోచుకోలేదు. వరుసపెట్టి వాయిదాలు పడుతూ వస్తోంఇ. సినిమా ఆలస్యానికి కారణం విజువల్ ఎఫెక్ట్సే. విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలోని గ్రాఫిక్స్ ఇంతవరకూ ఏ సినిమాలోనూ చూడనివై, సరకొత్తగా ఉండాలనేదే డైరెక్టర్ శంకర్ ఆలోచన. ఆ దిశగానే ఈ సినిమా గ్రాఫిక్స్‌ని రెడీ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫ్రెష్ అప్‌డేట్ ఏంటంటే, రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ నిర్ణయించి అఫీషియల్‌గా డేట్ ఫిక్స్ చేశారు. రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారంటే సినిమా కంప్లీట్ అయిపోయిందేమో అనుకునేరు.
ఇంకా కంప్లీట్ కాలేదట. కానీ వీలైనంత త్వరలో పూర్తి చేస్తామని మాటిచ్చారట. ఆ క్రమంలోనే నవంబర్ 29కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారట. అయితే అందరికీ తెలిసిన సంగతే. శంకర్ అస్సలు కాంప్రమైజ్ కాడు. ఒకవేళ ఆ టైంకి పూర్తి కాకుంటే మళ్లీ పోస్ట్ పోన్ అయినా కావచ్చు. ఇప్పటికైతే ఇదే అపీషియల్ డేట్ అంతే. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అమీజాక్సన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తున్నాడు.
|