Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
uncle

ఈ సంచికలో >> సినిమా >>

రేష్మీ గ్లామర్‌ 'అంతకుమించి'.!

reshmi glamour

హాట్‌ బ్యూటీ రేష్మీ గ్లామర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే రేష్మీ తాజాగా ఓ చిత్రంలో నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్రం టీజర్‌ విడుదలైంది. ఈ చిత్రంలో రేష్మీ గ్లామర్‌కి కుర్రకారు బేజారెత్తిపోతున్నారంటే నమ్మి తీరాల్సిందే మరి. హాట్‌నెస్‌ అన్‌లిమిటెడ్‌ అనే రేంజ్‌లో విజృంభించేసింది రేష్మీ ఈ సినిమాలో. ఇదంతా ఇంకా జస్ట్‌ టీజర్‌ టాకే. ట్రైలర్‌లో ఇంకెంత చూపిస్తుందో. అసలు సినిమాలో ఇంకే స్థాయిలో చూపించేసిందో అంటూ రేష్మీ ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. 'అంతకుమించి' అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఇంతకీ ఓ హారర్‌ అండ్‌ థ్రిల్లర్‌ మూవీ. ఊప్స్‌..!

మళ్లీ థ్రిల్లర్‌ మూవీనేనా అనుకుంటున్నారా? అవును మరి థ్రిల్లర్‌ మూవీస్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌ అన్న ముద్ర పోనిచ్చుకోవడం లేదు ఎందుకో రేష్మీ. సరే ఆ సంగతి అటుంచితే, ఈ సినిమాలో రేష్మీ అందాల దాడి ఒకెత్తు. హారర్‌ కథాంశం ఒకెత్తు అన్నట్లుగా ఉంది. టీజర్‌ కటింగ్‌లో అయితే హాఫ్‌ ఆఫ్‌ ది పార్ట్‌ రేష్మీతో హీరో గాఢమైన రొమాంటిక్‌ సీన్స్‌, చూపించి, ఇంకొక హాఫ్‌ పార్ట్‌ హారర్‌ సన్నివేశాలతో నింపేశాడు. ఇక్కడే డైరెక్టర్‌ క్రియేటివిటీ, తెలివితేటలు బయటపడుతున్నాయి. టీజర్‌తోనే శాంతం యూత్‌ని ఎట్రాక్ట్‌ చేసేశాడు డైరెక్టర్‌. ఇకపోతే ఈ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు రానున్న 'అంతకుమించి' సినిమా రేష్మీకి అంతకు మించిన పాపులారిటీని తెచ్చిపెడుతుందో లేదో చూడాలిక. 

మరిన్ని సినిమా కబుర్లు
mokshagyna entry