Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

బిగ్‌బాస్‌కి న్యూ గ్లామర్‌ వచ్చిందోచ్‌.!

big boss new glamour

బుల్లితెర రియాల్టీ షో 'బిగ్‌బాస్‌'లో కొత్త గ్లామర్‌ వాతావరణం నెలకొంది. బిగ్‌బాస్‌లో వివాదాలకు కేరాఫ్‌ ఆడ్రస్‌ అన్పించుకున్న హాట్‌ కంటెస్టెంట్‌ తేజస్విని ఎలిమినేషన్‌ తర్వాత వెంటనే వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలో హాట్‌ బ్యూటీ పూజా రామచంద్రన్‌ని తీసుకొచ్చారు. ఈ బ్యూటీ నటిగా పలు చిత్రాలతో ప్రేక్షకులకు సుపరిచితురాలే. ముఖ్యంగా 'సామిరారా' చిత్రంతో పూజా రామచంద్రన్‌ బాగా పాపులరైంది. ఇకపోతే హౌస్‌లో అమ్మడు అప్పియరెన్స్‌ అదిరిపోయింది. బిగ్‌బాస్‌ ఇస్తున్న టాస్క్‌లు కూడా బాగా పూర్తి చేస్తోంది. మెచ్యూర్డ్‌ మైండ్‌తో గేమ్‌ని బాగా ఆడుతోంది అని అప్పుడే పూజాపై పోజిటివ్‌ రిపోర్ట్స్‌ వస్తున్నాయి. అలాగే గ్లామర్‌ యాంగిల్‌ కూడా ఎక్కువే ఈ ముద్దుగుమ్మకి. సో హౌస్‌లో ఇంతవరకూ అనుకుంటున్న స్ట్రాంగెస్ట్‌ కంటెస్టెంట్స్‌కి గట్టి పోటీదారుగా అనిపిస్తోంది పూజా రామచంద్రన్‌.

ఇదిలా ఉంటే, ఇంతవరకూ ఎలిమినేట్‌ అయిన సంజన, నూతన్‌నాయుడు, కిరీటీ, భాను, శ్యామల, తేజు వీరిలో నుండి ఎవరో ఒకరు మరోసారి బిగ్‌హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయనీ తెలుస్తోంది. ముఖ్యంగా ఎలిమినేట్‌ అయిన వారిలో అందరూ ఏదో ఒక వివాదం కారణంగా బయటికి వచ్చినవారే ఒక్క శ్యామల తప్ప. పర్సనల్‌ రీజన్‌ కారణంగానే శ్యామలను హౌస్‌ నుండి తాత్కాలికంగా బయటికి పంపించారు. అందుకే మళ్లీ హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం శ్యామలకు ఎక్కువగా ఉందని తెలుస్తోంది. చూడాలి మరి హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చే ఆ లక్కీ కంటెస్టెంట్‌ ఎవరో.? ఈ విషయంలో ఈ వారమే ఓ క్లారిటీ రానుంది. 

మరిన్ని సినిమా కబుర్లు
hottest offer